Chicken Potato Nuggets: ఈ పదార్థాలు ఉంటే చాలు.. చికెన్‌ పొటాటో నగ్గెట్స్‌ రెడీ!

Recipes In Telugu: How To Prepare Chicken Potato Nuggets - Sakshi

బోన్‌లెస్‌ చికెన్‌.. బంగాళదుంపలు.. మొక్కజొన్న పిండి.. గుడ్లు... నోరూరించే చికెన్‌ పొటాటో నగ్గెట్స్‌ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి.
చికెన్‌ పొటాటో నగ్గెట్స్‌ తయారీకి కావలసినవి:  
►బోన్‌లెస్‌ చికెన్‌ – అర కప్పు (మెత్తగా ఉడికించి.. చల్లారాక చేత్తో చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి)
►బంగాళదుంపలు – 2 (మెత్తగా ఉడికించి.. తురుములా చేసుకోవాలి)
►జీలకర్ర పొడి, మిరియాల పొడి – 1 టీ స్పూన్‌ చొప్పున

►గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ – అర టీ స్పూన్‌ చొప్పున
►ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌
►కొత్తిమీర తురుము – కొద్దిగా

►మొక్కజొన్న పిండి  – 3 టేబుల్‌ స్పూన్లు
►గుడ్లు  – 2 (ఒక బౌల్‌ తీసుకుని అందులో గుడ్లు, అర టేబుల్‌ స్పూన్‌ పాలు పోసుకుని.. బాగా కలిపి పెట్టుకోవాలి)
►బ్రెడ్‌ పౌడర్‌ – గార్నిష్‌ కోసం
►నూనె  – డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ:
►ముందుగా ఒక బౌల్‌లో బంగాళదుంప తురుము, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, ►మొక్కజొన్న పిండి, చికెన్‌ ముక్కలు వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి.
►అనంతరం చిన్న చిన్న ఉండలుగా చేసుకుని.. చిత్రంలో ఉన్న విధంగా చతురస్రాకారంగా నలువైపులా ఒత్తుకోవాలి.
►వీటిని గుడ్డు–పాల మిశ్రమంలో ముంచి.. బ్రెడ్‌ పౌడర్‌ పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి.
►వేడివేడిగా సర్వ్‌ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. 

ఇవి కూడా ట్రై చేయండి: Moringa Chutney Recipe: ఇడ్లీ, దోశలోకి.. మొరింగా చట్నీ, వాల్‌నట్‌ చట్నీ! తయారీ ఇలా!
Banana Coffee Cake Recipe: బనానా– కాఫీ కేక్‌ ఇలా తయారు చేసుకోండి!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top