Moringa Chutney Recipe: ఇడ్లీ, దోశలోకి.. మొరింగా చట్నీ, వాల్‌నట్‌ చట్నీ! తయారీ ఇలా!

Recipes In Telugu: How To Make Moringa Chutney And Walnut Chutney - Sakshi

Healthy And Quick Chutney Recipes For Idli And Dosa: అదే ఇడ్లీ... అదే దోశ.. కనీసం చట్నీలైనా మారుద్దాం. నోటికి రుచికరమైన చట్నీ లేకపోతే బ్రేక్‌ఫాస్ట్‌ కూడా బోర్‌ కొడుతుంది. ఇడ్లీ, దోశలతోపాటు రోజూ తినే పల్లీ, కొబ్బరి, పుట్నాలు, టొమాటో పచ్చడి కాకుండా కాస్త విభిన్నంగా, హెల్దీగా ఉండే వివిధ రకాల చట్నీలు ఎలా చేసుకోవాలో చూద్దాం...

మొరింగా చట్నీ
కావలసినవి:
►నూనె – టీస్పూను
►మునగ ఆకులు – అరకప్పు
►పచ్చిమిర్చి – మూడు

►పచ్చికొబ్బరి తురుము – అరకప్పు
►అల్లం తురుము – టీస్పూను
►నిమ్మరసం – టీస్పూను
►ఉప్పు – రుచికి సరిపడా.

►తాలింపు కోసం: నూనె – టీస్పూను, ఆవాలు – అరటీస్పూను, జీలకర్ర – పావు టీస్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు.

తయారీ:
►బాణలిలో నూనె వేసి వేడెక్కనివ్వాలి.
►కాగిన నూనెలో పచ్చిమిర్చి, మునగ ఆకులు వేసి దోరగా వేయించాలి
►ఇప్పుడు మిక్సీజార్‌లో కొబ్బరి తురుము, వేయించిన మునగ ఆకులు, పచ్చిమిర్చి, నిమ్మరసం, అల్లం, రుచికి సరిపడా ఉప్పు, అరప్పు నీళ్లుపోసి మెత్తగా రుబ్బుకుని గిన్నెలో వేసుకోవాలి

►తాలింపు వేసుకుని ఈ మిశ్రమాన్ని చట్నీలో కలిపితే రుచికరమైన మొరింగా చట్నీ రెడీ. దోశ, చపాతీల్లోకి ఇది మంచి సైడ్‌ డిష్‌.
►చట్నీలో నిమ్మరసానికి బదులు చింతపండు లేదా పెరుగు కూడా వేసుకోవచ్చు.

వాల్‌నట్‌ చట్నీ
కావలసినవి:
►పచ్చికొబ్బరి తురుము – అరకప్పు
►వాల్‌నట్స్‌ – పావు కప్పు
►పచ్చిమిర్చి – మూడు
►అల్లం – అరంగుళం ముక్క

►చింతపండు – గోలీకాయంత
►కరివేపాకు – రెండు రెమ్మలు
►కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూను
►ఉప్పు– రుచికి సరిపడా.

తాలింపు దినుసులు: నూనె – టీస్పూను, ఆవాలు – పావు టీస్పూను, మినపగుళ్లు –పావు టీస్పూను, ఇంగువ – చిటికెడు.

తయారీ:
►కొబ్బరి తురుము, వాల్‌నట్స్, పచ్చిమిర్చి, అల్లం,  కొత్తిమీర తరుగు, కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేసి, అవసరాన్ని బట్టి కొద్దిగా వేడి నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. 
►ఇప్పుడు తాలింపు దినుసులతో తాలింపు వేసి రుబ్బిన పచ్చడిలో కలిపితే వాల్‌నట్‌ చట్నీ రెడీ.
►ఇడ్లీ, దోశ, ఉప్మా, పన్యారంలలో ఈ చట్నీ చాలా బావుంటుంది.

ఇవి కూడా ట్రై చేయండి:  Recipe: ముల్లంగి తురుము, రాగి పిండి, గోధుమ పిండితో ముల్లంగి నాచిన్‌ రోటీ!
Recipe: బనానా– కాఫీ కేక్‌ ఇలా తయారు చేసుకోండి!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top