24 గంటలూ ఓపెన్‌... సిబ్బంది మాత్రం నిల్‌! | This Ramen Store In Seoul Has No Staff | Sakshi
Sakshi News home page

24 గంటలూ ఓపెన్‌... సిబ్బంది మాత్రం నిల్‌!

Published Mon, Dec 11 2023 11:33 AM | Last Updated on Mon, Dec 11 2023 12:58 PM

This Ramen Store In Seoul Has No Staff - Sakshi

మార్కెట్లో రకరకాల దుకాణాలు వచ్చేస్తున్నాయి. ఈ ఏఐ పుణ్యమా అన్ని సాంకేతికతో కూడాన ఆధునిక స్టోర్‌లు మన ముందు ప్రత్యక్షమవుతున్నాయి. పైగా అన్నీ మన ఒడిలోకే వంచి వాలిపోయేలా పనులు చకచక అయిపోతున్నాయి. అయితే అదే తరహాలో ఇక్కడొక విలక్షణమైన స్టోర్‌ ఉంది. 24 గంటలు తెరిచే ఉంటుంది. కానీ ఒక్క సిబ్బంది కూడా ఉండరు. మరీ ఎలా పనిచేస్తుంది?. కస్టమర్లు ఎలా కొనుక్కుంటారు? అనే కదా డౌటు..!.

అలాంటి వెరైటీ స్టోర్‌ సియోల్‌లో ఉంది. దీనిపేరు రామెన్‌ స్టోర్‌. దీనిలో మనకు కావల్సిన అన్ని వస్తువులు ఉంటాయి. మనం అక్కడే కొనుక్కుని ఎంచక్కా వండకుని తినేసి రావొచ్చు. మరీ బిల్‌ ఎలా పే చేయాలంటే..మనకు మనమే స్వతహాగా పే చేయడమే. అలాగైతే ఎవరైనా ఈజీగా వస్తువులన్నీ ఎత్తుకుపోవచ్చు కదా అంటారా..! అంతా ఈజీ కాదు. ఎందుకంటే..? అడగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. మీరు నచ్చిన వస్తువులను తీసుకుని దాని పక్కనే ఉన్న బిల్‌పే చేసే ఆటోమెటిడ్‌ మెషిన్‌లో ఎంటర్‌ చేసి మనీ పే చేస్తే చాలు. ఒకరకంగా చెప్పాలంటే సెల్ఫ్‌ పేయింగ్‌ అన్నమాట!. 

ఈ మేరకు ఫుడ్‌ వ్లోగర్‌ లిల్లీ హ్యూన్‌ అనే ఆమె ఆ స్టోర్‌కి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో షేర్‌ చేసింది. అందులో ఆమె తనకు నచ్చిన న్యూడిల్స్‌, ప్రిపరేషన్‌కి కావాల్సిన పదార్థాల తోపాటు సైడ్‌ డిష్‌లను తాను ఎలా తీసుకుని బిల్‌ పే చేసిందో వివరించింది. ఆ తర్వాతా ఆమె అక్కడే ఎలా ఎంచక్కా వండుకుని తినేసిందో కూడా చెప్పింది. అక్కడ మనం కావల్సింది వండుకోవడమే గాక అందుకు కావాల్సిన సైడ్‌ డిష్‌లు కూడా ఉంటాయి. వాటికి మాత్రం బిల్‌ పే చేయాల్సిన అవసరం లేదు. అవి ఫ్రీ. ఐతే ఈ వీడియోని చూసిన నెటిజన్లు మాత్రం ఇది రియల్‌? ఆ..! అని ఆశ్చర్యపోయారు. చాలామంది ఇది వర్క్‌ ఔట్‌ అవ్వడం కష్టం అని అంటున్నారు. ఎందుకంటే ఆ సీసీటీవీలను కూడా పాడు చేసి ఎత్తుకుపోవడం వంటివి జరుగుతాయంటూ కామెంట్లు చేశారు.

(చదవండి: ఫ్రూట్‌ ఇడ్లీ గురించి విన్నారా? తయారీ విధానం చూస్తే..షాకవ్వుతారు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement