ఫ్రూట్‌ ఇడ్లీ గురించి విన్నారా? తయారీ విధానం చూస్తే..షాకవ్వుతారు! | Sakshi
Sakshi News home page

ఫ్రూట్‌ ఇడ్లీ గురించి విన్నారా? తయారీ విధానం చూస్తే..షాకవ్వుతారు!

Published Tue, Dec 5 2023 5:01 PM

Viral Video: The Preparation Of Apple Idli  - Sakshi

చాలా రకాల వెరైటీ ఇడ్లీలు చూసి ఉంటారు. స్వీట్‌ ఇడ్డీ కూడా చూసుంటారు. కానీ ఇది అలా ఇలా కాదు ఏకంగా పండుతో చేసిన ఫ్రూట్‌ ఇడ్లీ. పళ్లతోనా అని ఆశ్చర్యపోవద్దు. నిజం! చూస్తే మీరే షాకవ్వుతారు. ఎలా చేశాడంటే..

కుక్కపిల్ల, సబ్బు బిళ్ల..కాదేది కవితకు అనర్హం! అన్నట్టుగా వంటవాడికి పళ్లా, కాయగూరలా మరేదైనా అని కాదు వంట  చేయడం వస్తే చాలు. దేన్నైనా వండి.. వార్చేస్తాడు. అది కూరగాయా! పండు అని కాదు. జస్ట్‌ తన పాక నైపుణ్యంతో రుచికరంగా మార్చేస్తాడు. ఇక ఈ ఫ్రూట్‌ ఇడ్డీ ఎలా చేశాడంటే..యాపిల్‌ని సన్నగా తరిగి ఇడ్లీ పిండి మిశ్రమంలో కలిపాడు.

ఆ తర్వాత పిండిని ఇండ్లీల ట్రైలో పోసి ఆవిరిపై ఉడికించాడు. అంతే ఫ్రూట్‌ ఇడ్లీ రెడీ. పైగా రెండు రకాల చట్నీలు, ఓ సాంబర్‌ కూడా పెట్టి భలే అందంగా పండ్లతో గార్నిష్‌ చేశాడు. చూస్తే మాత్రం వామ్మో బాగుటుందా ? అని డౌటొస్తోంది కదూ. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.  

(చదవండి: ఈ తాబేలు వయసు ఎంతో చెప్పగలరా? డైనోసర్‌ని చూసొండొచ్చా?)

Advertisement
 
Advertisement
 
Advertisement