
నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫిట్‌నెస్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. జిమ్, యోగా, పైలేట్స్ , కార్డియో, రన్నింగ్, హైకింగ్, గోల్ప్ ఇలా వివిధ రకాల వర్కౌట్స్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. తన ఫిట్‌నెస్ రొటీన్, వ్యాయామ నియమావళికి సంబంధించిన స్నీక్ పీక్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. తాజాగా బాలెన్స్‌కు సంబంధించిన ఒక ఇంట్రస్టింగ్ వీడియోనే షేర్ చేసింది.
అందరూ వీకెండ్ మూడ్‌లో ఉంటే, రకుల్ ప్రీత్ ఒక ఆసక్తికరమైన విషయం గురించి చెప్పుకొచ్చింది. మనం పెద్దగా పట్టించుకోని “చిన్న కండరాలకు” కూడా ప్రాధాన్య ఇవ్వాలని, వాటి దృఢత్వం ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఇన్‌స్టాలో రెండు వీడియోలను పోస్ట్ చేసింది. అద్భుతమైన బాలెన్సింగ్‌తో చిన్న వాటర్ బాల్ వ్యాయాయాన్ని చేసి చూపించడం విశేషం.
ఇదీ చదవండి: వెయిట్‌లాస్‌కి 6 చిట్కాలు : సిల్లీ కాదు..సూపరంటున్న ఫిట్నెస్ కోచ్
ఈ ట్రైనింగ్‌లో చిన్న కండరాలను బలోపేతం చేయడంతో పాటు, బరువులు ఎత్తడం అంతే ముఖ్యమని పేర్కొంది. మొదట్లో బోసు బాల్‌పై కూడా బ్యాలెన్స్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఈ చిన్న నీటి బంతి మీద సులువుగా చేస్తున్నానని వెల్లడించింది. ఈ వీడియోలో ముందు తన చేతులను ఫ్రీగా వదిలేసి బ్యాలెన్స్ చేయగా, ఆ తరువాత జోతులను కలిపి ఉంచి, ఒంటి కాలిపై సింగిల్-లెగ్ స్క్వాట్స్తో ఫ్లూయిడ్ బాల్‌పై తన శరీరాన్ని బాలెన్స్ చేసింది. ఈ సారి జిమ్‌కి వెళ్ళినప్పుడు ఇలా ప్రయత్నించండం అంటూ అభిమాలకు సూచించింది.
(నో-షుగర్, నో-మిల్క్: 45 కిలోలు తగ్గింది, ఇప్పటికీ కష్టాలే!)
స్మాల్‌బాల్ ఎక్సర్ సైజ్ లాభాలు
ఈ బ్యాలెన్సింగ్ టెక్నిక్ వల్ల సమన్వయం, శరీర నియంత్రణ , ప్రతిచర్యలను మెరుగుపరుస్తుంది. మొత్తం క్రియాత్మక బలం పెరుగుతుంది.
మంచి బ్యాలెన్సింగ్ శక్తిని ఇస్తుంది. ఉదర కండరాలను బలోపేతం చచేస్తుంది. కోర్‌ను టోన్ చేయడంతోపాటు బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి.
పోశ్చర్ (భంగిమను) మెరుగుపరుస్తుంది.శరీర అమరికను సాధించడంలో సహాయపడుతుంది.
కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది, గాయాలు, ఆర్థరైటిస్ నొప్పులను నివారిస్తుంది. బాడీకి ఫ్లెక్సిబిలీటీని అందిస్తుంది. ముఖ్యంగా తుంటి, వీపు , భుజాల చుట్టూ, కండరాల దృఢత్వాన్ని మంచిది.