
బాలీవుడ్ ప్రసిద్ధ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు ఫ్యాషన్, నటనల పరంగా సాటిలేరవ్వరూ. తన వైవిధ్యభరితమైన నటనతో ప్రేక్షకులను అలరించి, వేలాదిగా అభిమానులను సొంతం చేసుకుంది. అలాంటి ఆమెకు చిన్న సంఘటనకు కూడా కన్నీళ్లు(cry) ధారాళంగా వచ్చేస్తాయంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పైగా ఆపడం తన తరం కాదంటూ ఎమోషనల్‌గా మాట్లాడింది. నిజానికి ప్రియాంక భావోద్వేగాలను హ్యాండిల్ చేయగలదు. వాటి విషయంలో భయపడదు కానీ, బాధ కలిగించే సంఘటనలు జరిగితే మాత్రం కళ్లల్లో నీళ్లు తిరిగిపోతాయని చెబుతోంది. అస్సలు ఇలా ఎందుకు జరుగుతుంది. కొందరూ అస్సలు ఏడుపుని బయటకి వ్యక్తం చెయ్యరు. మరికొందరు మాత్రం కళ్ల కిందే నీళ్ల కుండ పెట్టుకున్నట్లుగా వలవల ఏడ్చేస్తుంటారు ఎందుకని..? అంటే..
మన శరీరం భావోద్వేగాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగించే సహజసిద్ధమైన మార్గమే ఏడుపు అని చెబుతున్నారు మానసిక నిపుణులు(Psychologist). అయితే కొందరూ అత్యంత సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాంటివాళ్లు తమ భావోద్వేగాలని ఆపుకోలేరు. దీంతో సులభంగా కనుల నుంచి నీళ్లు కుండపోత వాన వచ్చినట్లుగా వచ్చేస్తుంటాయి
ఇలా ఎందకంటే..
సున్నితమైన భావ్వోద్వేగం..
అధిక సున్నితమై భావోద్వేగ కలవారు చాలా సులభంగా కన్నీళ్లు పెట్టేస్తుకుంటారట. వారి భావోద్వేగాలు ఇట్టే బయటపడిపోతాయట. దీంతో ఇలాంటి వ్యక్తులు తన భావోద్వేగం తగ్గేంత వరకు ఏడుస్తూనే ఉంటారట.
ఒత్తిడి కారణంగా..
ఒత్తిడి, ఆందోళన కారణంగా మనసు బరువు ఎక్కువైపోయి ఉంటే ఒక్కసారిగా ఏడుపు రూపంలో అది వ్యక్తమవుతుందట. దీన్ని ప్రెషనర్ కుక్కర్‌తో పోల్చి చెప్పొచ్చని అంటున్నారు. అంతేగాదు మనస్తత్వ శాస్త్రవేత్తలు భావోద్వేగాలతో మనసు నిండిపోయినప్పుడూ దాన్ని శరీరం ఏడుపు రూపంలో ఇలా బయటకు పంపిస్తుందని చెబుతున్నారు.
హార్మోన్ల వల్ల...
హార్మోన్ల మార్పులు కూడా కన్నీటిని గణనీయంగా ప్రభావితం చేస్తాయట. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్‌లో హెచ్చుతగ్గులు, ముఖ్యంగా ఋతుస్రావం, గర్భధారణ లేదా రుతువిరతి సమయంలో, వ్యక్తులు ఏడుపుకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలా మంది మహిళలు తమ రుతు చక్రాల సమయంలో అధిక భావోద్వేగాలను అనుభవిస్తారు.
నిద్ర లేమి, మానసిక ఆరోగ్యం
నిద్ర లేకపోవడం భావోద్వేగ నియంత్రణను బలహీనపరుస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా వ్యక్తులు చిన్నదానికి కూడా అతిగి రియాక్ట్ అయ్యి కన్నీళ్లు కార్చేస్తారని చెబుతున్నారు. కొందరికి రోజువారీగా ఏడుపు ఏదో రూపంలో వస్తే మాత్రం మానసిక ఆరోగ్య సమస్యగా పరిగణించి సకాలంలో చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు.
ఏడుపు ఆరోగ్యకరమైనదేనా?
భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి ఏడుపు అనేది సహజసిద్ధమైన ఆరోగ్యకరమైన మార్గం. భావాలను అణచివేయడం కంటే ఏడవడమే మంచిదని చెబుతున్నారు. దీనివల్ల గుండెల్లో భారం తగ్గి ప్రశాంతంగా ఉంటారట. అయితే, ఏడుపు అధికంగా లేదా అదుపు చేయలేనిదిగా మారితే మాత్రం అతర్లీనంగా ఉన్న ఆరోగ్య సమస్యగా పరిగణించాలని అన్నారు. సరైన మానసిక నిపుణుల వద్ద కౌన్సిలింగ్ తీసుకుని ఈ సమస్య నుంచి బయటపడే యత్నం చేయాలని సూచిస్తున్నారు.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment