హైకింగ్, పిక్నిక్‌కి పర్ఫెక్ట్‌ గ్రిల్‌ ఇది.. నిమిషాల్లో వెరైటీ వంటలు | Portable Outdoor Grill To Cook Different Food Items | Sakshi
Sakshi News home page

హైకింగ్, పిక్నిక్‌కి పర్ఫెక్ట్‌ గ్రిల్‌ ఇది.. నిమిషాల్లో వెరైటీ వంటలు

Oct 12 2023 3:26 PM | Updated on Oct 12 2023 3:31 PM

Portable Outdoor Grill To Cook Different Food Items - Sakshi

క్యాంపింగ్‌ అనగానే కంఫర్ట్‌ చూసుకుంటాం. ఏదైతే సులభంగా, సురక్షితంగా ఉంటుందో దాన్నే ఎంచుకుంటాం. అలాంటి కుక్‌ వేరే ఇది. ఈ గ్రిల్‌ని.. హైకింగ్, పిక్నిక్‌.. ఇలా  ఎక్కడికి వెళ్లినా చక్కగా వెంట తీసుకెళ్లొచ్చు. బార్బెక్యూ రుచులను అందించడంలో దిట్ట. మన్నికైన స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో రూపొందిన ఈ గ్రిల్‌.. తుప్పు పట్టదు. చాలా సౌకర్యంగా ఉంటుంది.

దీనిపై పైనాపిల్, స్వీట్‌ కార్న్, చికెన్, ఫిష్, రొయ్యలు ఇలా అన్నింటినీ గ్రిల్‌ చేసుకోవచ్చు. శాండ్విచ్, బర్గర్‌ వంటివి నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. ఒకేసారి చాలా ఐటమ్స్‌ తయారు చేసుకోవడానికి రెండు వేరువేరు గ్రిల్‌ ప్లేట్స్‌.. గ్రిల్‌ పాన్స్‌ ఉంటాయి. ఇరువైపులా స్టోరేజ్‌ ర్యాక్స్‌ ఉంటాయి. వండినవి.. ప్లేట్‌లో వేసుకుని, ఆ ర్యాక్స్‌పై పెట్టుకోవచ్చు.

లేదా ఉప్పు, కారం, మసాలాలు అందుబాటులో ఉండేలా వాటిపై ఉంచుకోవచ్చు. ఈ గ్రిల్‌ని ఫోల్డ్‌ చేసుకోవడం, అనువుగా స్టాండ్స్‌పై అమర్చుకోవడం.. అవసరాన్ని బట్టి ఎత్తుని అడ్జస్ట్‌ చేసుకోవడం ఇలా ప్రతీదీ చాలా ఈజీ. ధర 74 డాలర్లు (రూ.6,050).


 

Advertisement
 
Advertisement
Advertisement