కెమిస్ట్రీ పాఠాన్ని ఇలా కూడా బోధిస్తారా? ఆ టీచర్‌ వేరే లెవల్‌! | Physics Wallah Teacher Used His Body To Explain A Chemistry Concept | Sakshi
Sakshi News home page

ఫిజిక్స్‌ సార్‌ కెమిస్ట్రీ పాఠాన్ని ఏ రేంజ్‌లో బోధించారో తెలిస్తే ఫిదా అవుతారు..!

Published Tue, Dec 17 2024 1:06 PM | Last Updated on Tue, Dec 17 2024 1:17 PM

Physics Wallah Teacher Used His Body To Explain A Chemistry Concept

ఉపాధ్యాయుల బోధనా పద్ధతులన్నీ.. విద్యార్థులకు విపులంగా అర్థం కావాడమే ప్రధాన అంశం. అందుకోసం ఒక్కొక్క టీచర్‌ ఒకో పంథాలో తమ క్లాస్‌ని చెబుతుంటారు. కొందరు టీచర్లు చెప్పే  బోధనా పద్ధతి విద్యార్థులకు బోరింగ్‌ ఫీలింగ్‌ కలగుకుండా ఆ సబ్జెక్ట్‌పై ఆసక్తిని పెంచేలా ఉంటుంది. అచ్చం అలానే ఓ ఫిజిక్స్‌ ఉపాధ్యాయుడు విద్యార్థులకు రసాయన శాస్త్రంలోని ఓ కాన్సెప్ట్‌ క్లియర్‌గా అర్థం కావాలని ఎంతలా కష్టపడ్డాడో చూస్తే.. ఫిదా అవ్వాల్సిందే.

ఎలా చెప్పారంటే..ప్రముఖ ఎడ్‌ టెక్‌కి చెందిన ఒక ఫిజిక్స్‌ ఉపాధ్యాయుడు విద్యార్థులకు కెమిస్ట్రీలోని చిరాలటీ కాన్సెప్ట్‌ని బోధిస్తున్నారు. చిరాలటీలో అణువులు ఒక చిరాల్‌ కేంద్రాన్ని కలిగి ఉంటాయి. అద్దంలో అతిగా ఇంపోజ్‌ కావు. కాకపోతే రసాయన చర్యలో ఎడమ, కుడిగా కుడి ఎడమ గానూ అద్దంలో కనిపించే చిత్రంలాగా కనిపిస్తుంది. అదే దీని ప్రత్యేకత. 

ఇది విద్యార్థులకు అర్థమయ్యేలా తన శరీర భంగిమలతో క్లియర్‌గా వివరించారు. చెప్పాలంటే తన బోధనలో యోగాని కూడా మిళితం చేసి చెబుతున్నట్లుగా వివరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఆ ఉపాధ్యాయుడికి తన వృత్తిపై ఉన్న అభిరుచి, నిబద్ధతలను ప్రశంసిచగా, మరికొందరు ఇంతలా కష్టపడటం ఎందుకు త్రీడీ వస్తువులతో లేదా ఏదైనా ప్లాస్టిక్‌ వస్తువులను ఉదాహరణగా తీసుకుని చెబితే సరి అని కామెంట్‌లు చేస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: 20 ఏళ్లకే డాక్టర్‌, 22 ఏళ్లకు ఐఏఎస్‌ ఆఫీసర్‌..ఇవాళ ఏకంగా..!)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement