రెస్టారెంట్‌ విచిత్ర షరతు.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు!

Men Are Allowed To Eat If They Come With Female At This Jaipur Restaurant - Sakshi

రాజస్థాన్‌లోని జైపూర్‌కి చెందిన ఓ రెస్టారెంట్‌.. కస్టమర్లకు ఓ విచిత్ర షరతు పెట్టింది. కస్టమర్ల పక్కన మహిళ ఉంటేనే లోపలికి ప్రవేశమట. అందేంటి?? అనుకుంటున్నారా... దీనికి సంబంధించిన పోస్ట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఓ వ్యక్తి ఆకలేసి సదరు హోటల్‌కి వెళ్లబోతే, పక్కన లేడీ ఎవ్వరూ లేరని వెనక్కి పంపారట. దీనితో ఒక మహిళను తీసుకొచ్చి, హోటల్లో కూర్చోబెట్టి కడుపునిండా తిన్నాడట. ఐతే పాపం ఆ మహిళ మాత్రం పప్పు రోటీ తినడానికి ఈ వ్యక్తి నన్నిక్కడికి తీసుకొచ్చాడనే క్యాప్షన్‌తో తన ఇమేజ్‌తో సహా ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ పోస్టుపై నెటిజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: మార్నింగ్‌ వాక్‌కి వెళ్లింది... కోటీశ్వరరాలైంది!!

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top