అకటా... నడిబజార్‌లో లక లక లక | Sakshi
Sakshi News home page

అకటా... నడిబజార్‌లో లక లక లక

Published Sun, May 19 2024 6:12 AM

Manjulika spotted in Guwahati video viral

‘కంటెంట్‌ క్రియేటర్‌లు తలుచుకుంటే వైరల్‌కు కొదవా!’ అన్నట్లుగా ఉంది పరిస్థితి. వీడియో వైరల్‌ చేయడానికి వారు చిత్రవిచిత్రములు చేయగలరని మరోసారి నిరూపించిన వైరల్‌ వీడియో ఇది.

ప్రీతీ థాపాఅనే క్రియేటర్‌ చంద్రముఖి గెటప్‌లో డ్యాన్స్‌ చేసింది. ఇందులో వింతేముంది అనిపించవచ్చు. అయితే ప్రీతి డ్యాన్స్‌ చేసింది స్టేజీ మీద కాదు. ఇంట్లో కాదు. ఏకంగా అస్సాంలోని గువాహటి చౌరస్తాలో.

ఈ వీడియోకు వచ్చిన విశేష ఆదరణ చూసి సంతోషంతో.... ‘గయ్స్, మీకు కృతజ్ఞతలు తెలియజేయడానికి నాకు మాటలు రావడం లేదు’ అని స్పందించింది ప్రీతి.

‘మీకు సంతోషంతో మాటలు రాక΄ోవడం సరే, మాకు మాత్రం షాక్‌తో నోట మాట రాలేదు. రోడ్డుపై డ్యాన్స్‌ ఏమిటీ!’ అని వెక్కిరించారు కొందరు నెటిజనులు.
‘మీ డ్యాన్స్‌ స్కిల్స్‌ సంగతి ఎలా ఉన్నా ముందు ట్రాఫిక్‌ రూల్స్‌ను ΄ాటించడం నేర్చుకోండి’ అని కొందరు సలహా ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement