బాపట్ల: మద్యం మత్తులో ఓ మహిళ నడిరోడ్డుపై వీరంగం సృష్టించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఫుల్ గా మద్యం తాగిన యువతి.. వైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి దాడి చేయడం కనిపించింది. ఈ ఘటన బాపట్ల పట్టణంలోని రైలు పేట ప్రాంతంలో ఉన్నశ్రీనివాస వైన్స్ షాపులో చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితం ఈ సంఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మద్యం సేవించిన సదరు మహిళ, షాప్ సిబ్బందితో అనవసరంగా వాగ్వాదానికి దిగి తీవ్ర స్థాయిలో రెచ్చిపోయింది. కేవలం మాటలతో ఆగకుండా, వైన్స్ షాపు లోపలికి వెళ్లి అక్కడి సిబ్బంది పై విచక్షణారహితంగా దాడికి దిగింది. సదరు మహిళ సిబ్బందిని కొడుతుండగా, చుట్టుపక్కల ఉన్నవారు వారించే ప్రయత్నం చేసినా ఆమె ఏమాత్రం తగ్గలేదు. స్థానికులు ఈ ఘటనను చూసి విస్తుపోయారు. మద్యం మత్తులో మహిళ ఇలా బహిరంగ ప్రదేశంలో హంగామా సృష్టించడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. ఈ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఏపీలో వైన్ షాపులో మహిళ హల్చల్
బాపట్ల పట్టణంలోని వైన్ షాపులో పని చేసే యువకుడిపై దాడి చేసి, తిరిగి అతడిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ pic.twitter.com/i0RTJjFIdq— Telugu Scribe (@TeluguScribe) January 24, 2026


