విటమిన్‌ ’సి’తో అది కలిసి క్యాన్సర్‌ కారకంగా మారుతుంది.. వీటికి దూరం మేలు!

Maintain Distance Cool Drinks In Summer - Sakshi

వేసవి రాబోతోంది. ఇక కూల్‌డ్రింక్స్‌ తాగడమనే అలవాటు పెరుగుతుంది. ఇటు పిల్లలూ, అటు పెద్దలూ హానికరమైన ఈ శీతలపానీయాలవైపు మొగ్గుతారు. వీటిల్లో చక్కెర మోతాదులు చాలా ఎక్కువ. అందుకే పిల్లల్లో ఊబకాయానికి, ఫలితంగా భవిష్యత్తు లో డయాబెటిస్‌ రిస్క్‌కి అవకాశాలు ఎక్కువ. అలాగే అందులోని ఫాస్ఫారిక్‌ యాసిడ్, దంతాలపై ఉండే అనామెల్‌ పొరను దెబ్బతీస్తుంది. క్యాల్షియం మెటబాలిజమ్‌ను దెబ్బతీస్తుందని, దాంతో ఎముకల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు పడతాయనే దాఖలాలూ ఉన్నాయి.

కృత్రిమ రంగులు కిడ్నీలపై  దుష్ప్రభావం చూపుతాయి. నిల్వ ఉంచేందుకు దోహదపడే రసాయనాలైన సన్‌సెట్‌ ఎల్లో, ట్యాట్రజైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్‌ వంటివి పిల్లల్లో అతిధోరణులకు కారణమవుతాయి. సోడియం బెంజోయేట్‌ విటమిన్‌ ’సి’తో కలిసినప్పుడు క్యాన్సర్‌ కారకం (కార్సినోజెన్‌)గా మారుతుంది. ఇన్ని అనర్థాలు ఉన్నందున ముందునుంచే కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండటం ఈ వేసవికే కాదు... ఎప్పుడూ మేలు. 
చదవండి: (Beauty Tips: పెదాలను సెలైవాతో తడిచేస్తున్నారా .. అందులోని ఎంజైమ్స్‌ వల్ల!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top