
ప్రపంచంలో అత్యంత ప్రముఖ బిలియనీర్లు కథలు వింటంటే అత్యంత ఆశ్చర్యం కలుగుతుంటుంది. అసాధారణ నేపథ్యం నుంచి అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తి అవాక్కయ్యేలా చేస్తుంటారు. అంతేగాదు సక్సెస్ అసలైన అర్థం చెబుతుంటారు. కష్టపడేతత్వం ఉన్నవారు ఎన్నటికైనా విజయం సాధిస్తారనేందుకు స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ కోవలో బిల్‌గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్‌వంటి ప్రముఖులను చూశాం. తాజాగా వారి సరసన 30 ఏళ్ల లూసీ గోవా(Lucy Guo) అనే మహిళ నిలిచింది. ఎవరామె అంటే..
కాలేజ డ్రాపౌట్ అయినా ఆమె ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అంతేగాదు ఫోర్బ్స్ ఆమెను అతిపిన్న వయస్కురాలైన స్వీయ నిర్మిత బిలియనీర్‌గా పేర్కొంది. ఆమె నికర విలువ సుమారు రూ. 1.15 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అయితే లూసీ విజయ ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. కాలిఫోర్నియాకు చెందిన లూసీ అమెరికాలో కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ అండ్ హ్యుమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్‌ని కోర్సులో చేరింది.
అయితే ఆమె డిగ్రీ పూర్తిచేయడానికి కేవలం ఒక ఏడాది ఉండగానే కాలేజ్ నుంచి తప్పుకుంది. 2011లో థీల్ ఫెలోషిప్‌లో చేరింది. ఈ ఫెలోషిప్ పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్ ఎంపిక చేసిన యువకులకు వారి స్వంత కంపెనీలను ప్రారంభించేందుకు కోటి రూపాయలు పైనే తోడ్పాటుని అందిస్తుంది. అయితే ఆమె ఇలా కాలేజ్‌కి స్వస్తి చెప్పి ఫెలోషిప్‌లో జాయిన్ అవుతాననడం లూసీ తల్లిదండ్రులను చాలా షాక్‌కి గురి చేసింది.
ఎందుకంటే లూసీ అమెరికాలో మంచి భవిష్యత్తు లభించాలని ఆమె పేరెంట్స్ ప్రతిదీ పణంగా పెట్టి చదివించారు. ఇలా మద్యలో కాలేజ్ చదువుని వదలేయడం వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. ఒకరకంగా లూసీ కూడా ఈ అనూహ్య నిర్ణయం తీసుకుందే గానీ మనసులో ఏదో భయం వెంటాడుతూనే ఉంది. కానీ తన కలల ప్రపంచం కోస ఈ మాత్రం డేర్ చేయకపోతే కష్టం అని తనకు తాను సర్ది చెప్పుకుని మొండి ధైర్యంతో ముందుకు సాగింది.
అలా ఆమె తన తొలి ఏఐ బిజినెస్‌ని ప్రారంభించింది. దీని తర్వాత టెక్ దిగ్గజం మెటాను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం ఆమె జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. అలా ఆమె అంచలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కంపెనీలకు సారథ్యం వహిస్తూ..2022లో కంటెంట్ క్రియేటర్ మానిటైజేషన్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకురాలిగా మారింది. ఆ విధంగా అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తి అత్యంత ధనవంతురాలైన వ్యవస్థాపకురాలిగా మారిందామె.
అయితే లూసీ ఒకటో లేక రెండు సంత్సరాలైనా.. కాలేజ్‌కి వెళ్లాలని అంటుంది. అక్కడే మంచి స్నేహితులు, జీవితంలో అత్యంత విలువైన వ్యక్తులు గురించి తెలుసుకునేందుకు హెల్ప్ అవుతుందని అంటోంది. పైగా కాలేజ్ అనేది నేర్చుకోవడానికే కాదు మంచి స్నేహితులను సంపాదించుకోవడం కూడా నేర్పుతుందని చెబుతోంది. అదే భవిష్యత్తులో పెట్టబోయే కంపెనీల్లో వాళ్లు ఉద్యోగులు గానో లేక మీ కంపెనీ భాగస్వాములు గానో ఎంపిక చేసుకునేందుకు దారితీస్తుందని చెబుతుంది.
అంతేగాదు విజయవంతమైన కంపెనీ నిర్మించాలంటే పిచ్చి తపన, ఆత్మవిశ్వాసం అత్యంత ముఖ్యమని చెప్పింది. తనకు ఈ థీల్ ఫెలోషిప్ తాను ఈ పనిచేయగలను అనే వాతావరణాన్ని అందించిందని చెబుతోంది లూసీ. ఆమె కథ కాలేజ్‌కి వెళ్లి ఎంజాయ్ చేసే యువతకు ఆదర్శం. భవిష్యత్తు మంచిగా నిర్మించుకునే కీలక వయసుని సరైన మార్గంలోకి తీసుకువెళ్లాలంటేజజ కచ్చితమైన వ్యూహం, ప్రణాళికి ఎంతలా అవసరం అనేందుకు వ్యవస్థాపకురాలు లూసీ స్టోరీనే ఉదహారణ. 30 ఏళ్లకే పాస్సెస్ అనే కంపెనీ నడిపి, కంటెంట్ క్రియేటర్‌లను సరికొత్త స్థాయిలో నిలిపింది, వాళ్లతో సంపదను ఎలా సృష్టించచ్చో చూపించింది. కృషికి తోడు ధైర్యం ఉంటే ఏదైనా అవలీలగా సాధించొచ్చని లూసీ కథే చెబుతోంది కదూ..!.
(చదవండి: Navratri celebrations : 'డిజిటల్ గర్భా': పండుగను మిస్ అవ్వకుండా ఇలా..!)