వేసవి సెలవులు ముగిసి బడులు తెరిచారంటే, పిల్లలకు స్కూల్ బ్యాగులతో పని మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా స్కూల్ బ్యాగుల మార్కెట్ శరవేగంగా పరుగులు తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా స్కూల్ బ్యాగుల మార్కెట్‌లో సగటున 6 శాతానికి పైగా వార్షిక వృద్ధి రేటు నమోదవుతోంది. గడచిన ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా స్కూల్ బ్యాగుల మార్కెట్ పెరుగుదల ఎలా ఉందో గణాంకాల్లో చూద్దాం...

‘కోవిడ్–19’ తర్వాత ప్రపంచవ్యాప్తంగా బడి ఈడు పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరి సంఖ్య ఆసియా దేశాల్లో మరింతగా పెరిగింది. ఫలితంగా ‘కోవిడ్–19’ తర్వాత స్కూల్ బ్యాగుల మార్కెట్ గణనీయంగా పుంజుకుంది. స్కూల్ బ్యాగుల మార్కెట్ విలువ ప్రకారం చూసుకుంటే, అమెరికా మొదటి స్థానంలో నిలుస్తోంది. ఏటా అమ్ముడయ్యే బ్యాగుల సంఖ్య ప్రకారం చూసుకుంటే, మన భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. అమెరికా సహా పలు సంపన్న దేశాల్లో ఏటా అమ్ముడయ్యే బ్యాగుల సంఖ్య తక్కువే అయినా, అక్కడ ఎక్కువగా బ్రాండెడ్ స్కూల్ బ్యాగులు అమ్ముడవుతుంటాయి. అందువల్ల ఆ దేశాల్లో మార్కెట్ విలువ ఎక్కువగా ఉంటోంది. స్కూల్ బ్యాగు మార్కెట్‌లో టాప్–10 దేశాలు గణాంకాల్లో చూద్దాం...


