పుట్టిన వెంటనే పన్ను.. అరుదైన అద్భుతం! | Newborn Born With Tooth Doctors Removed It After Causing Feeding Problems, Check More Details Inside | Sakshi
Sakshi News home page

పుట్టిన వెంటనే పన్ను.. అరుదైన అద్భుతం!

Jul 7 2026 9:41 AM | Updated on Jul 7 2026 10:48 AM

newborn born with tooth doctors remove it to help feeding

తూర్పుగోదావరి: రాయవరం మండలం వెంటూరుకు చెందిన జి.నందినికి పన్నుతో పాప పుట్టింది. ఆ పసికందును ద్రాక్షారామలోని భీమేశ్వర దంత వైద్యశాలకు సోమవారం తీసుకువచ్చారు. దంతం బాగా కోరగా ఉండటంతో పాలు తాగించడానికి ఇబ్బంది కలుగుతోందని తెలపడంతో, ఏడు రోజుల ఆ పసికందుకు డాక్టర్‌ బచ్చు క్రాంతికుమార్‌ చాకచక్యంగా పన్నును తొలగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన ఆరు నెలకు రావాల్సిన దంతం, జన్యుపరమైన వ్యత్యాసాలతో పుట్టుకతోనే రావడం జరిగిందన్నారు. అటువంటి సందర్భాలలో ఒక్కోసారి పన్ను దానంతట అదే కదిలిపోయి ఊడిపోవచ్చన్నారు. అలా జరిగితే ఆ పన్ను పసికందు ఊపిరితిత్తుల్లోకి పోయి ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో ఆ పన్నును తొలగించినట్టు తెలిపారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement