అమ్మాచిని మించి దైవం ఉన్నదా!

Kerala man lifts her mother on shoulders and takes her on a trip - Sakshi

మనం చిన్నవయసులో ఉన్నప్పుడు అమ్మ ఎత్తుకుంటుంది. కుంచెం నడవడం వచ్చిన తరువాత కూడా ఎత్తుకోమని అమ్మ దగ్గర మారాం చేసేవాళ్లం. అలాంటి అమ్మను ఎత్తుకోవడాన్ని మించిన అదృష్టం ఏం ఉంటుంది! కేరళకు చెందిన రోజన్‌ పరంబిల్‌ స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం చేస్తాడు. అయిదు సంవత్సరాల తరువాత సొంత ఊరు వచ్చాడు. వయసు పైబడి, బలహీనంగా కనిపిస్తున్న అమ్మాచి(అమ్మ)ను చూసి చాలా బాధేసింది. ఎంతో కాలంగా ఇంటి నాలుగు గోడలకే పరిమితమైన అమ్మకు బయటిగాలి తాకేలా ట్రిప్‌ ప్లాన్‌ చేశాడు.

ఈ చిరు ప్రయాణంలో వారు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. రకరకాల జ్ఞాపకాలను కలబోసుకుని తెగ నవ్వుకున్నారు. నచ్చిన చోట ఆగి సెల్ఫీలు తీసుకున్నారు. గతంలో ఒకసారి రోజన్‌ తన తల్లిని స్విట్జర్లాండ్‌ తీసుకువెళ్లి యూరప్‌లోని రకరకాల ప్రదేశాలు చూపెట్టాడు. తల్లిలో అప్పుడు  కనిపించిన ఎనర్జీ ఇప్పుడు మరోసారి కనిపించింది. ట్రిప్‌ కోసం రోజన్‌ తన తల్లిని భుజాల మీద మోస్తూ కారు దగ్గరికి తీసుకువెళుతున్న వీడియో వైరల్‌ అయింది. నెటిజనులను కదిలించేలా చేసింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top