
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 72,088 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె రాజకీయనాయకురాలిగా తన ప్రస్థానం మొదలుపెట్టనుంది.
ముచ్చగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 9న ప్రమమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో కంగనా రనౌత్ సరికొత్త స్టన్నింగ్ లుక్‌లో కనిపించింది. ఆమె నిజమైన బంగారం, వెండితో నేసిన చీరలో తళుక్కుమంది. అందుకు తగట్టు ధరించిన నగలతో అందర్నీ ఆకర్షిచింది. రాజకీయనాయకురాలిగా హుందాగా కనిపించేలా సరికొత్త దేశీ స్టయిల్‌ని అనుసరిస్తోంది.
My oath day look, howz it ? 🙂 pic.twitter.com/VgKGJof69S
— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 9, 2024
ఈ వేడుక కోసం చేనేత చీర, అమ్రపాల జ్యువెలరీస్‌ని ఎంపిక చేసుకుంది కంగనా. లైట్ మేకప్‌తో వెరైటీ హెయర్ స్టయిల్‌తో సరికొత్త లుక్‌లో కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖేష్ అంబానీ, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు.