
గ్రామభారతి, సిఎస్‌ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రీయ సంతను నిర్వహిస్తున్నారు. ఆధునిక సమాజంలో ఆర్గానిక్ ఉత్పత్తులకు ఆదరణపెరుగుతోంది.సేంద్రీయ ఆహారం ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సేంద్రీయ ఆహారాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలనే అవగాహన కూడా బాగా పెరిగింది. ఇలా ఆర్గానిక్ ఉత్పత్తులు, సంప్రదాయ రుచులు , సహజ ఆహారాలను ఇష్టపడేవారికి ఈ సంత ఒక అవకాశం కావచ్చు.
సికింద్రాబాద్ తార్నాకలోని మర్రి కృష్ణా హాల్‌లో ఈ నెల 11 (శనివారం)న ఉ. 10 నుంచి సా. 7 గం. వరకు సేంద్రియ/ప్రకృతి ఆహారోత్పత్తుల మూలం సంత జరగనుంది. దేశీ వరి బియ్యం, చిరుధాన్యాలు, ఇతర ఉత్పత్తులు, సంప్రదాయ పిండివంటలు, చేనేత వస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు నిర్వాహకులు సూర్యకళ తెలిపారు.
సంప్రదాయ రుచులతో కూడిన ఆర్గానిక్ భోజనం ఈ సంత ప్రత్యేకత.
ఇతర వివరాలకు.. 94908 50766.