జమల్‌ జమలు కుదు... యానిమలు! | Sakshi
Sakshi News home page

జమల్‌ జమలు కుదు... యానిమలు!

Published Sun, Jan 7 2024 6:32 AM

Jamal kudu animal song youth favorate ringtone bobby deol - Sakshi

‘యానిమల్‌’ సినిమాలో బాబీ డియోల్‌ ఎంట్రీ సాంగ్‌ ‘జమల్‌ జమలు కుదు’ సూపర్‌హిట్‌ అయింది. ఈ పాటలో ఒక్క ముక్క అర్థం కాకపోయినా యూత్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ పాట యూత్‌ ఫ్రేవరెట్‌ రింగ్‌ టోన్‌గా మారింది. ‘జమల్‌ జమలు కుదు’ అనేది 1950 నాటి ఇరానీ పాట. ఇరానీ కవి బిజన్‌ స్మందర్‌ ఈ పాట రాశారు. ఖటరెహ్‌ మ్యూజిక్‌ గ్రూప్‌ ట్యూన్‌ కంపోజ్‌ చేసింది. తొలిసారిగా 1950లో టెహ్రాన్‌లోని ఖరజెమీ హైస్కూల్‌లో పాడారు.

‘జమల్‌ జమలు కుదు’ అంటే ఆంగ్లంలో ‘వో మై లవ్, మై స్వీట్‌ లవ్‌’ అని అర్థం. ఈ పాటలో కనిపించిన తనాజ్‌ దావూది సోషల్‌ మీడియాలో వైరల్‌ గర్ల్‌గా మారింది. టెహ్రాన్‌లో పుట్టి పెరిగిన తనాజ్‌ డ్యాన్సర్, మోడల్‌. ‘యానిమల్‌’ షూటింగ్‌ సమయంలో తనాజ్‌ ముంబైలో ఉంది. ఈ పాటకు సంబంధించిన ఓల్డ్‌ వెర్షన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘యానిమాల్‌ సినిమాలోని పాట కంటే ఓల్డ్‌ వెర్షన్‌ బాగా ఎంజాయ్‌ చేసే విధంగా ఉంది’ అంటూ స్పందిస్తున్నారు నెట్‌లోకవాసులు.

Advertisement
 
Advertisement