
ఇటీవలి కాలంలో కూతుళ్లు ఉన్న తల్లులలోఒక ఆందోళన కనిపిస్తోంది. అదేంటంటే పదేళ్ల వయసుకే కూతుళ్ళు రజస్వల కావడం. ఇది వారి భవిష్యత్తు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.. అనే భయాన్ని దూరం చేయాలనుకుంటున్నారు. తమ గురించి తమకు ఏ మాత్రం తెలియని అమ్మాయిల్లో తొలి నెలసరి ఆలస్యంగా రావాలని తల్లులు ప్రయత్నిస్తున్నారు, ఇది మంచి పరిణామం అంటున్నారు నిపుణులు.
కూతుళ్ళ తొలి నెలసరి ఆలస్యంగా రావడాన్ని తల్లులు ప్రయత్నించవచ్చా...
ఈ విషయం గురించి ఇటీవల రిబెక్కా కిండెర్మన్ అనే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ ప్రాంతానికి చెందిన తల్లి తన 10, 12 ఏళ్ళ కుమార్తెలకు నెలసరి ఆలస్యం కావాలన్న లక్ష్యంతో కుటుంబ ఆహారం నుండి స్క్రీన్ టైం చూసే వరకు అన్నీ మార్చేసింది. ఆమె ఈ విషయంపై చేసిన ఇన్ స్ట్రాగామ్ రీల్ (@bec&kinderman) 1.6 మిలియన్ల వీక్షణలు, 57,000కు పైగా లైకులు పొందింది.
‘పిల్లల మెదడు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకముందే, వారిపై ఇంటర్నెట్‌లో కనిపించే విషయాలు ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ వయస్సులోనే పెద్దవాళ్లలా మారకుండా, చిన్న పిల్లలుగా ఉండేలా చేయాలనుకుంటున్నాను,‘ అంటారు ఆమె. ఈ తల్లి చేస్తున్న ప్రయత్నం గురించి మనమూ ఆలోచించాలి. మన కూతుళ్ళ భవిష్యత్తు ఆరోగ్యం గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.
అమెరికాలో బాలికలు మొదటిసారి నెలసరి అయ్యే సగటు వయస్సు 11.9 సంవత్సరాలు. 11 ఏళ్లకు ముందే నెలసరి ్ర΄ారంభమయ్యే బాలికల శాతం16 గా ఉంది. ఇండియాలోనూ ఈ శాతం ఇదే విధంగా ఉంది.
నెలసరి.. బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు..
12 ఏళ్ల వయస్సు ముందు నెలసరి వచ్చే బాలికలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 23 శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ఎండోమెట్రియల్, ఓవరియన్ క్యాన్సర్లకు కూడా ఇది కారణంగా ఉండే ప్రమాదం ఉంది.
గతంలో ఇలా ఉండేది కాదు. రచయిత ఎలెనా బ్రిడ్జర్స్ తెలిపిన ప్రకారం, గిరిజన సమాజాలలో బాలికలు సుమారు 17 ఏళ్ల వయస్సులో తొలి నెలసరి పొందేవారు, తగిన అండాశయాల విడుదల 19 ఏళ్ల వయస్సులో మొదలయ్యేది.
ప్రాంచీన కాలంలో మానవ మేధస్సు, శరీరం ముందు నుంచీ వయోజన భావోద్వేగాలను ఎదుర్కొనేవి. కానీ నేటి బాలికలు ఇప్పుడే పీరియడ్లు, బాల్య గర్భధారణను ఎదుర్కొంటున్నారు,‘ అని ఆమె చెప్పారు. ఈ పరిస్థితిని ‘ఎవల్యూషనరీ మిస్‌మ్యాచ్‘గా అభివర్ణిస్తూ, బ్రిడ్జర్స్ ఇలా అన్నారు: ‘ఇప్పుడు రి పొడక్టివ్ ప్యూబర్టి చైతన్యం అతి త్వరగా వస్తోంది, కానీ మానసికంగా, శారీరకంగా పరిపక్వత రావడం లేదు.‘
రసాయనాలు కీలకం
ప్యూబర్టి ముందే మొదలవడం వల్ల గర్భస్రావం, నెలసరి సమస్యలు, ఆందోళన, డిప్రెషన్, పీసీఓఎస్ వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఆహారం, ఒత్తిడి, రసాయనాలు వంటి పర్యావరణ అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీన్ని దష్టిలో ఉంచుకుని కిండెర్మన్ తన పిల్లలను సంపూర్ణ సహజ జీవనశైలిలో పెంచుతున్నారు.
ఆమె కుటుంబం ఎక్కువగా ఆర్గానిక్ ఆహారాన్ని తీసుకుంటుంది, పంటలపై ఉండే పెస్టిసైడ్ మిగులు తొలగిస్తారు, ఇంట్లో రసాయనాల్లేని పరిసరాలను కల్పిస్తారు. ‘సువాసన కోసం పిల్లలు ఉపయోగించే పరిమళ ద్రవ్యాలు హార్మో¯Œ లను ప్రభావితం చేస్తాయి, అందుకే మేం ఇంట్లోనే ఎసెన్షియల్ ఆయిల్స్‌తో పరిమళాలు తయారు చేస్తాం,‘ అని చెబుతున్నారు.
న్యూజిలాండ్‌కు చెందిన నికీ స్కిన్నర్ (@nourished&and&vibrant) కూడా తన 7, 4 సంవత్సరాల కుమార్తెల కోసం ఇదే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
‘ఇది సహజ అభివృద్ధిని కృత్రిమంగా నియంత్రించడమేం కాదు,‘వాతావరణ అంశాలు నెలసరి ముందే రావడానికి కారణమవుతున్నాయని తెలుసుకొని, వాటిని నియంత్రించగలిగినంతవరకు నేను తల్లిగా జాగ్రత్త పడుతున్నాను..‘ అంటారు ఆమె.
నిపుణుల మాటలలో...
నాచురోపతి వైద్యురాలు లారా బ్రిడెన్ చెప్పిన ప్రకారం, 8 సంవత్సరాల వయస్సుకు నెలసరి రావడం అసాధారణమైన విషయం. 11 ఏళ్ల లోపల నెలసరి రావడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్, , బ్రెస్ట్ క్యాన్సర్ వంటి అనేక సమస్యలతో నెలసరికి సంబంధం ఉంది. మెటబాలిక్ డిస్‌ఫంక్షన్ వల్ల ఇలా జరిగే అవకాశాలు ఎక్కువ. ఆహారం, పర్యావరణ మార్పులు, వ్యాయామం లేకపోవడం, ఎపిగెనెటిక్ ప్రభావాలు ... ఇవన్నీ నెలసరి ముందుగా రావడానికి కారణాలు. బ్రిడ్జర్స్ హెచ్చరిస్తూ ‘నెలసరి ఆలస్యం చేయాలనే లక్ష్యం తల్లిదండ్రులకు, పిల్లలకు ఒత్తిడిని కలిగించవచ్చు. అది ఆరోగ్యానికి హానికరమైన చర్యలకూ దారితీయవచ్చు‘ అని కూడా అంటున్నారు.
మాట్లాడటానికి భయపడవద్దు..
కిండెర్మర్ అండ్ స్కిన్నర్ తమ కుమార్తెలతో జరిపిన సంభాషణలు కూతుళ్లు ఉన్న తల్లులకు తప్పక ఉపయోగపడతాయి.
‘మీ పిల్లలు నెలసరి వస్తే భయపడకూడదు. అది ఒక ప్రకృతి సహజమైన చర్యగా సానుకూలంగా తీసుకోవాలి. పిల్లలకు పూర్తి అవగాహన ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాం‘ అంటున్నారు. పిల్లల చిన్నప్పటి నుంచే వారి శారీరక, మానసిక ఆరోగ్య విధానాలలో జాగ్రత్తలు తీసుకుంటే తల్లుల్లోనూ ఆందోళన తగ్గుతుంది.
– నిర్మలారెడ్డి
జీవనశైలి మార్పులే కారణం
మా వద్దకు 8, 10 ఏళ్ల వయసున్న అమ్మాయిల్ని రజస్వల అయ్యింది అని తల్లులు తీసుకొస్తుంటారు. ఆందోళన పడుతుంటారు. ఆ పిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియని వయసు. పాల్ట్రీ ఉత్పత్తులు, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, వాతావరణం, క్రీడల వంటి శారీరక వ్యాయామం లేకపోవడం.. వంటి వాటి వల్ల చిన్నవయసులోనే రజస్వల కావడం ఇటీవల జరుగుతోంది. కొన్ని సార్లు వారి జీన్స్, ఎండోక్రైౖ మ్స్ పనితీరులో లోపాల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. జీవనశైలి సరిగా ఉండేలా చూసుకోవడంతో పాటు, రెగ్యులర్ చెకప్స్, నిపుణుల సూచనలు పాటిస్తూ, అవగాహన పెంచుకుంటే సమస్య తగ్గుతుంది.
– డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్, హైదరాబాద్