పీసీఓఎస్‌ కట్టడికి మలేరియా మందు | Indications And Precautions For Polycystic Ovary Syndrome | Sakshi
Sakshi News home page

పీసీఓఎస్‌ కట్టడికి మలేరియా మందు

Aug 18 2024 4:37 AM | Updated on Aug 18 2024 4:37 AM

Indications And Precautions For Polycystic Ovary Syndrome

మహిళలను ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో పాలీసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌) ఒకటి. దీనిని పూర్తిగా నయం చేయగల చికిత్స ఏదీ లేనప్పటికీ, లక్షణాలను చాలా వరకు నియంత్రణలో ఉంచగల పలు చికిత్సా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, మలేరియా నివారణకు వాడే చైనీస్‌ సంప్రదాయ ఔషధం పీసీఓఎస్‌ను సమర్థంగా అదుపు చేయగలదని లండన్‌ శాస్త్రవేత్తలు జరిపిన ఒక తాజా పరిశోధనలో తేలింది.

చైనీస్‌ సంప్రదాయ వైద్యంలో ఉపయోగించే మూలికల నుంచి వేరు చేసి రూపొందించిన ‘ఆర్టిమిసినిన్‌’ అనే ఔష«ధాన్ని చాలాకాలంగా మలేరియా చికిత్సలో ఉపయోగిస్తున్నారు. పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు ఈ ఔషధాన్ని పన్నెండు వారాల పాటు వాడినట్లయితే, వారిలో పీసీఓఎస్‌ లక్షణాలు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పీసీఓఎస్‌తో బాధపడే మహిళలు ‘ఆర్టిమిసినిన్‌’ను పన్నెండు వారాలు వాడిన తర్వాత వారిలో నెలసరి సక్రమంగా రావడంతో పాటు టెస్టోస్టిరాన్‌ విడుదల తగ్గుముఖం పట్టినట్లు నిర్ధారణకు వచ్చారు.

పీసీఓఎస్‌ చికిత్సలో ఇది సరికొత్త పరిణామమని లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన సీనియర్‌ క్లినికల్‌ లెక్చరర్‌ డాక్టర్‌ చన్న జయసేన వెల్లడించారు. పీసీఓఎస్‌ సమస్య అండాశయాల్లోనే మొదలైనా, ఇది మొత్తం శరీరమంతా ప్రభావం చూపుతుందని, దీనివల్ల స్థూలకాయం, అవాంఛిత రోమాలు పెరగడం, గుండెజబ్బులు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయని, పీసీఓఎస్‌తో బాధపడే మహిళల ఆరోగ్యాన్ని ఈ ఔషధం గణనీయంగా మెరుగుపరచగలదని ఆయన తెలిపారు.

ఇవి చదవండి: Health: నేను నాలా లేను..!?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement