
ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల తల్లులకు ఆదాయ పన్ను మినహాయింపును ప్రకటించారు హంగేరి ప్రధాని విక్టర్ ఓర్బాన్. దీనివల్ల ఇద్దరు పిల్లలు ఉన్న 6,50,000 మంది తల్లులు, ముగ్గురు పిల్లలు ఉన్న 2,50,000 మంది తల్లులు లబ్ధి పొందుతారు.
2026 ఎన్నికకు ముందు ఈ ప్రకటన రావడం విశేషం. జనన రేటుని పెంచడానికి ప్రధాని ఓర్బాన్ చేస్తున్న ప్రయత్నాలలో ఒకటి. అంతేగాదు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, కుటుంబాలకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో గృహ రుణాల వడ్డీ రేట్లను కూడా 5%కి పరిమితం చేసింది. పైగా ఇది యూరప్‌లోనే అతిపెద్ద పన్ను మినహాయింపని చెప్పారు ప్రధాని ఓర్బాన్
ఇంతకుముందు ఈ మినహాయింపు 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న తల్లులు, నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలు ఉన్న తల్లులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ మినహాయింపు ఈ ఏడాది అక్టోబర్ నుంచి ముగ్గురు పిల్లలున్న తల్లులు ఇది అమలులోకి రాగా, వచ్చే ఏడాది 2026 జనవరి నుంచి ఇద్దరు పిల్లల తల్లులకు ఈ పన్ను మినహాయింపు అమల్లోకి రానుంది.
(చదవండి: ఉద్యోగం మాన్పించడం కూడా గృహహింసే..!)