పోమోగ్రానేట్‌ షాంపైన్‌ సార్బెట్‌.. రెస్టారెంట్‌ స్టైల్‌లో చేసేయండిలా | How To Make Pomegranate Champagne Sorbet Recipe In Telugu | Sakshi
Sakshi News home page

పోమోగ్రానేట్‌ షాంపైన్‌ సార్బెట్‌.. రెస్టారెంట్‌ స్టైల్‌లో చేసేయండిలా

Jan 2 2024 1:22 PM | Updated on Jan 2 2024 1:34 PM

How To Make Pomegranate Champagne Sorbet Recipe In Telugu - Sakshi

పోమోగ్రానేట్‌ షాంపైన్‌ సార్బెట్‌ తయారీకి కావల్సినవి:

బ్రూట్‌ షాంపైన్‌ – ఒకటిన్నర కప్పులు; పంచదార – కప్పు;
లైట్‌ కార్న్‌ సిరప్‌ – టేబుల్‌ స్పూను; దానిమ్మ రసం – ఒకటీ ముప్పావు కప్పులు;
విప్డ్ప్‌ క్రీమ్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు; దానిమ్మ గింజలు – రెండు టేబుల్‌ స్పూన్లు.



తయారీ విధానమిలా:
సాస్‌పాన్‌లో షాంపైన్, కార్న్‌ సిరప్, పంచదార వేసి మీడియం మంట మీద పంచదార కరిగేంత వరకు మరిగించి, దించిన తర్వాత దానిమ్మ రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని రిఫ్రిజిరేటర్‌లో పెట్టాలి.రెండుగంటల తరువాత మిశ్రమాన్ని ఐస్‌క్రీమ్‌ మేకర్‌తో బీట్‌ చేయాలి.క్రీమ్‌లా మారిన మిశ్రమాన్ని షాంపైన్‌ గ్లాస్‌లో వేయాలి. పైన విప్డ్‌ క్రీమ్, దానిమ్మ గింజలతో గార్నిష్‌ చేస్తే పోమోగ్రానేట్‌ షాంపైన్‌ సార్బెట్‌ రెడీ.  

Advertisement
 
Advertisement
Advertisement