How To Make Crispy Masala Mathri Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Crispy Masala Mathri :  వర్షాకాలంలో బెస్ట్‌ స్నాక్స్‌.. క్రిస్పీ మసాలా మత్రీ చేసుకోండి ఇలా

Aug 10 2023 4:55 PM | Updated on Aug 10 2023 6:15 PM

How To Make Crispy Masala Mathri Recipe In Telugu - Sakshi

క్రిస్పీ మసాలా మత్రీ తయారికి కావల్సినవి
గోధుమ పిండి – రెండు కప్పులు; వాము – అరటీస్పూను; కసూరీ మేథి – రెండు టేబుల్‌ స్పూన్లు; కారం – అరటేబుల్‌ స్పూను; గరం మసాలా – అరటేబుల్‌ స్పూను; కార్న్‌ స్టార్చ్‌ – టేబుల్‌ స్పూను ; నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా.



తయారీ విధానమిలా:
గోధుమ పిండిలో వాము, కసూరీ మేథి, కారం, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
దీనిలో టేబుల్‌ స్పూను నెయ్యివేసి మరోసారి కలపాలి ∙ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలాగ కలపాలి.
మిగిలిన టేబుల్‌ స్పూను నెయ్యిని కార్న్‌స్టార్చ్‌లో వేసి పేస్టులా కలపాలి.
పిండి ముద్దను మందపాటి గుండ్రని చెక్కల్లా వత్తుకోవాలి. ఈ చెక్కలపైన కార్న్‌ పేస్టురాయాలి.
చెక్కలను మీడియం మంటమీద క్రిస్పీగా మారేంత వరకు డీప్‌ప్రై చేసుకుంటే మసాలా మత్రీ రెడీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement