
కోకోనట్ మిల్క్ కేక్ తయారీకి కావల్సినవి:
కొబ్బరి పాలు – అర లీటరు, పాలు – పావు లీటరు,
పంచదార – పావు కప్పు, నిమ్మరసం – 1 టీ స్పూన్
పిస్తా, బాదం తురుము – గుప్పెడు(అభిరుచిని బట్టి మరిన్ని, నేతిలో వేయించుకోవాలి)
తయారీ విధానమిలా:
ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాత్రలో పాలు పోసి.. చిన్న మంట మీద మరిగించాలి. తర్వాత కాసేపటికి నిమ్మరసాన్ని ఒక టేబుల్ స్పూన్ నీళ్లలో బాగా కలిపి.. మరుగుతున్న పాలలో చుక్క చుక్క చొప్పున వేస్తూ ఉండాలి. పాలు చిక్కబడే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో కొబ్బరిపాలు, పంచదార కలపాలి.
కోవాలా అయ్యే వరకు మరిగించాలి. దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ బౌల్ తీసుకుని, దాని లోపల నెయ్యి రాసి, ఈ మిశ్రమం మొత్తం వేసుకుని.. బాదం పిస్తా పలుకులు చల్లాలి. చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవాలి. లేదంటే నచ్చిన విధంగా క్రీమ్స్‌తో గార్నిష్ చేసుకుని బర్త్‌డే కేక్‌లా తయారుచేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment