
కొబ్బరి జీడిపప్పు మైసూర్ పాక్ తయారీకి కావల్సినవి:
శనగపిండి – కప్పు; పచ్చికొబ్బరి తురుము – కప్పు; సన్నగా తరిగిన జీడిపప్పు పలుకులు – ముప్పావు కప్పు ;
చక్కెర – రెండు కప్పులు ; నెయ్యి – ముప్పావు కప్పు ; యాలకులు – నాలుగు; నీళ్లు – ఒకటి ముప్పావు కప్పులు.
తయారీ విధానమిలా..
- శనగపిండిని జల్లెడపట్టుకుని, అరకప్పు నెయ్యి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి మందపాటి గిన్నెలో చక్కెర, నీళ్లు పోసి తీగపాకం వచ్చేంత వరకు మరిగించాలి.
- తీగపాకం వచ్చిన తరువాత కొబ్బరి తురుము, జీడిపప్పు పలుకులు వేసి కలపాలి.
- ఇప్పుడు వేయించి పెట్టుకున్న శనగపిండి వేసి కలపాలి.
- చివరిగా యాలకులను దంచి వేయాలి ∙ఈ మిశ్రమంలో మిగిలిన నెయ్యిని టేబుల్ స్పూను చొప్పున వేస్తూ కలుపుతూ ఉండాలి.
- నెయ్యి మొత్తం వేసిన తరువాత చక్కగా కలిపి, మిశ్రమం గట్టిపడకముందే దించేయాలి.
- ఇప్పుడు నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేటులో ఈ మిశ్రమాన్ని వేసి ఆరనివ్వాలి ∙పదినిమిషాల తరువాత ముక్కలుగా కట్ చేస్తే కొబ్బరి జీడిపప్పు మైసూర్ పాక్ రెడీ.