
వర్షాకాలంలో అడుగు జారకుండా ఆటలు ఆడేందుకు, పాదాలు తడవకుండా తిరగడానికి.. ఇవే సరైన జోళ్లు
జల్లుల్లో జంపింగ్ ఫ్రెండ్స్!
చినుకుల్లో తడుస్తూ మురిసిపోవాలనేది చిన్నారులకుండే సరదా! కాని, అదే సమయానికి పాదాలను స్లిప్పరీ చెప్పులు ఉంటే? చినుకుల ఆనందం కాస్త చిటపట చిరాకుగా మారిపోతుంది. అడుగు జారిందంటే, వెంటనే అమ్మ చేసిన వడలు చేతిలో కాదు, చెంప మీద వేడి వేడిగా ఉంటాయి.
ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే, మీ దగ్గర తప్పకుండా ఈ ‘స్లిప్ ఆన్ క్యాజువల్ షూస్’ ఉండాలి. చూడగానే వావ్ అనిపించే కలర్, డిజైన్స్‌తో ఎంతో స్టయిల్‌గా ఉంటాయి. లేసులూ లేవు, హడావిడీ లేదు. ఇవి వేసుకొని అడుగు బయట పెడితే, ఇక ఎలాంటి వర్షమొచ్చినా జారిపడే ప్రమాదం ఉండదు. మట్టిలో దూకినా, బూట్లు ఏమాత్రం గోల చేయవు. పిల్లల వయసుకు తగ్గట్టు, వివిధ సైజుల్లో లభిస్తాయి. ధర రూ.799 మాత్రమే!
వర్షంలో వంకరలేని స్టయిల్!
వర్షాకాలం వచ్చింది అంటే, ఫ్యాషన్ ఫ్రీక్స్‌కి రోజూ ఒకే ప్రశ్న ‘చక్కగా కనిపించాలా? లేక తడవకుండా ఉండాలా?’ ఇవి రెండూ కాకుండా మూడో ఆప్షన్ ఉంది. ఆ రెండూ ఒకటే చోట ఉండటం. అదే, ఈ ‘క్రాక్స్ క్యాజువల్ స్లిపాన్స్’ ప్రత్యేకత! వీటిని వేసుకున్న ప్రతిసారీ అడుగులు కంఫర్ట్‌గా, లుక్ క్లాసీగా ఉంటుంది.
అబ్బాయిలైనా, అమ్మాయిలైనా.. ఎవరికైనా ఇవి ఫర్‌ఫెక్ట్ ఫిట్. మెరిసే క్రాక్ లైట్ మెటీరియల్, స్మూత్ ఫినిష్‌తో ఉంటాయి కాబట్టి, తడికి జారిపోయే పరిస్థితి రాదు. అంతేకాదు, మురికి నీరు, మట్టి, బురద ఇలా చెప్పులకు ఏది అంటినా, టిష్యూతో తుడిచేస్తే చాలు. శుభ్రంగా, ఫ్రెష్‌గా ఉంటాయి. ధర రూ. 5,395.
షూ తప్పనిసరి అయితే, ఇవి అవసరం!
కాలేజ్‌లో ‘షూ తప్పనిసరి!’ అని నోటీసు చూశారా? ఆఫీస్ ఫార్మల్స్‌లోకి షూస్ తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదా? కాని, బయట చూస్తే బురద, మట్టి, మురికి నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయా? ఇలా భయపడకండి! ఒక్కసారి ఈ ‘హిల్‌సన్స్ హై యాంకిల్ షూస్’ ట్రై చేయండి. ఇవి స్టూడెంట్‌కైనా, స్టాఫ్‌కైనా, ఎవరికైనా చక్కగా సరిపోతాయి.
ఫుల్ రఫ్ అండ్ టఫ్‌గా వాడుకునేలా దీని పీవీసీ సోల్ మెటీరియల్, కంఫర్ట్ కోసం లోపల కాటన్ లైనింగ్‌తో వీటిని డిజైన్ చేశారు. లైట్ వెయిట్ కూడా. స్టయిలిష్ లుక్ కంటే, వర్షంలో జారిపోని గౌరవమే మిన్న అనుకునేవారు తప్పకుండా వీటిని ట్రై చేయండి. ధర రూ. 514 మాత్రమే!