
వర్షాకాలం రైతులు పొలంలో విత్తనాలు వేస్తుంటారు. మొలకెత్తిన గింజ ధాన్యాలతో నారుమడులు కడుతుంటారు. సాగుకు ఉపయోగపడే పనులు ఏ విధంగా అవుతుంటాయో.. ఆ కళ మన ఇంటిలోనూ కనిపించాలంటే ధాన్యపు గింజలను నింపిన చిన్న చిన్న జనుప సంచులకు రంగులు వేసి, వాటిని వరుసలుగా పేర్చితే గది రూపరేఖలే మారిపోతాయి.
సంచుల గుచ్ఛాలు
పుష్ప గుచ్ఛాల గురించి మనకు తెలిసిందే! చిన్న చిన్న జ్యూట్ సంచులకు ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ కుట్టి, ఆర్టిఫిషియల్ గింజలను అలంకరణకు ఉపయోగించవచ్చు. ఈ హ్యాంగర్స్‌ను కిచెన్, బాల్కనీ ఏరియాల్లో అలంకరిస్తే అందంగా ఉంటుంది.
ఆకర్షణీయంగా కనిపించేలా ...
సంచులను లేసులు, ప్యాచ్ వర్క్, రిబ్బన్ వర్క్ ద్వారా అందంగా తయారు చేసుకోవచ్చు. వాటిలో ఉపయోగించే గింజ ధాన్యాలలో వడ్లు, మొక్కజొన్న, కందులు, పెసలు వంటి వేర్వేరు రంగుల్లో కనిపించే గింజలతో నింపవచ్చు.
సంచుల కుండలు
జనుపనారతో తయారుచేసిన చిన్న చిన్న ఉట్టెలను, వెదురుతో తయారుచేసిన బుట్టలనూ ఈ అలంకరణలో ఉపయోగించవచ్చు. వరి కంకులను, తాటాకుల డిజైన్లను, పక్షుల బొమ్మలనూ ఈ సంచుల అలంకరణలో వాడుకోవచ్చు.
– ఎన్.ఆర్
(చదవండి: ప్లాస్టిక్‌ను తినేసే పుట్టగొడుగులు)