సైక్లింగ్‌తో యాక్టివ్‌గా..! | health benefits: Cycling Improves fitness and mental wellbeing | Sakshi
Sakshi News home page

సైక్లింగ్‌తో యాక్టివ్‌గా..!

Jun 6 2026 4:26 PM | Updated on Jun 6 2026 5:42 PM

health benefits: Cycling  Improves fitness and mental wellbeing

ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే, వీటన్నింటికీ ఒకే ఒక్క సులువైన పరిష్కారం ఉంది, అదే సైక్లింగ్‌. మరి ఆ సైక్లింగ్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.

శరీర భాగాల సమన్వయం, సమతుల్యత మెరుగవుతుంది.రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడిని తగ్గించి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. ఊబకాయం నుంచి కాపాడుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. కేన్సర్‌ నివారణకు సహాయపడుతుంది. కీళ్ల కదలికలు సులువవుతాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. 

ఒత్తిడిని తగ్గించే ప్రాణయామం
యోగాలో శ్వాస నియంత్రణ ప్రక్రియను ణాయామం అంటారు. ప్రాణ (జీవశక్తి) + ఆయామ (నియంత్రణ/విస్తరణ) కలయికే ప్రాణాయామం. ఇది ఒత్తిడిని తగ్గించి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది.
ప్రయోజనాలు: ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చి, కుడి ముక్కు ద్వారా వదలడం వల్ల నాడీ వ్యవస్థ శుభ్రపడుతుంది. 
భ్రామరీ: తుమ్మెదలా శబ్దం చేస్తూ గాలిని వదలడం. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది.
కపాలభాతి: శ్వాసను వేగంగా బయటకు వదలడం. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, జీవక్రియను మెరుగుపరుస్తుంది.
భస్త్రిక: బలమైన, వేగవంతమైన శ్వాస ప్రక్రియ. శరీరంలో శక్తిని పెంచుతుంది.
ముఖ్యమైన జాగ్రత్తలు: ఖాళీ కడుపుతో (ఉదయం లేదా సాయంత్రం) చేయడం మంచిది. గుండెజబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు నిపుణుల సమక్షంలోనే అభ్యసించాలి.
– అనిత పాతర్ల, యోగా ట్రైనర్‌ 

(చదవండి: Weight loss Tips: 65 కేజీల నుంచి 58 కేజీలకు..! ఆ ఐదు వ్యాయామాలతో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement