Hair Care Tips In Telugu: జుట్టు విపరీతంగా రాలుతోందా? వారానికి 2 సార్లు ఇలా చేశారంటే..

Hair Care Tips For Women: మగువల అందాన్ని రెట్టింపుచేసేది కురులే.. నల్లని, ఒత్తైన కురుల సంరక్షణకు ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జుట్టు రాలడాన్ని నివారించి, మరింత ఆరోగ్యంగా పెరిగేందుకు తోడ్పడేందుకు ఈ చిట్కా పాటించండి..
రెండు బంగాళ దుంపలను తొక్కతీసి సన్నగా తురుముకోవాలి. ఈ తురుములో రెండు టేబుల్ స్పూన్ల అలొవెరా జెల్, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పది నిమిషాలు మర్దన చేయాలి. తరువాత తలకు టవల్‌తో చుట్టి కవర్ చేయాలి. రెండు గంటల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి, పెరుగుతుంది.
చదవండి: Science Facts: మోచేతికి ఏదైనా తగిలితే అందుకే షాక్ కొట్టినట్టు ‘జిల్’ మంటుంది..!
సంబంధిత వార్తలు