పొడవాటి జుట్టు లేకపోయినా మిస్‌ ఫ్రాన్స్‌గా కిరీటం దక్కించుకుంది! అందానికి..

French Beauty Pageant Winner Defends Her Short Hairstyle - Sakshi

ఫ్రాన్స్‌ అందాల పోటోల్లో జడ్జీలు విభిన్నమైన దానికి ప్రాధాన్యత ఇస్తు జడ్జిమెంట్‌ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందాల పోటీకి అసలైన నిర్వచనం ఏంటో క్లియర్‌గా చెప్పారు. ఓ మహిళ నీకు సరిలెవ్వరూ. ప్రతి స్త్రీ అందంగా విభిన్నంగా ఉంటుంది. ఎవరీ అందం వారిదే. స్త్రీల అందాన్ని ఎవరూ డిక్టేట్‌ చేయకూడదనే ఉద్దేశ్యంతో పొడవాటి కురులు లేకపోయినా మగవాళ్ల మాదిరిగా జుట్టు ఉన్న అమ్మాయిని ఎంపిక చేసి ఆశ్చర్యపరచడమే గాక పలువురు విమర్శులు అందుకున్నారు. ఈ మేరకు నార్డ్‌ పాస్‌ డి కైలస్‌కు చెందిన 20 ఏళ్ల గిల్లెస్‌ మిస్‌ ఫ్రాన్స్‌గా కిరీటాని దక్కించుకుంది.

దీంతో 103 ఏళ్ల ఫ్రాన్స్‌ అందాల పోటీల చరిత్రలో పొడవాటి జుట్టు లేని మహిళగా గిల్లెస్‌ నిలిచింది. పిక్సీ కట్‌ ఉన్న గిల్లెస్‌ని విజేతగా ‍ప్రకటించడం గురించి మీడియా ప్రశ్నించగా.. ఇంతవరకు పొడవాటి జుట్టుతో అందమైన మిస్‌లనే చూడటం అలవాటు చేసుకున్నాం కానీ పొట్టి జుట్టుతో ఆండ్రోజినస్‌ లుక్‌ని ఎంచుకోవాలని నిర్ణయిచామని ఈ పోటీకి జడ్జీలుగా వ్యవహరించినవారు అన్నారు. ప్రతి స్త్రీ విభిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఓ ప్రత్యేకం. ఎవర్నీ డిక్టేట్‌ చేయలేమని చెప్పేందుకే ఆమెను సెలక్ట్‌ చేశామని అన్నారు. మిస్‌ యూనివర్స్‌ లేదా ఫ్రాన్స్‌ కావడానికి ‍ప్రత్యేకమైన అర్హత అంటూ దేన్ని పరిగణలోనికి తీసుకోం.

వేదికపైకి వచ్చే ప్రతి రూపాన్ని స్వీకరిస్తాం, వారిలోని ఆత్మవిశ్వాసాన్ని బేరీజు వేసి ఎన్నిక చేస్తామని అందాల పోటీల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు కిరీటాన్ని దక్కించుకున్న గిల్లిస్‌ మాట్లాడుతూ..నేను బలమైన మహిళగా ఉండాలనుకుంటున్నాను.  మహిళలు విభిన్నమైవారిని చూపాలనుకున్నాను. ఇక్కడ  నా జుట్టు ప్రత్యేకం కాదు. నేను జీవితాన్ని ఇవ్వడం లేదా శ్వాసించడం లేదా జీవించడం వల్లే తాను ప్రత్యేకమని చెబుతోంది గిల్లేస్‌.

కాగా, మిస్‌ఫ్రాన్స్‌ ఫైనల్‌కి ఏడుగురు మహిళలు రాగా ప్రజల ఓటు తోపాటు న్యాయనిర్ణేతల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని విజేతలను ప్రకటించడం జరుగుతుంది. నిజానికి మిస్‌ ఫ్రాన్‌ కిరీటం దక్కించుకున్న గిల్లెస్‌ మూడో స్థానంలో ఉన్నప్పటికీ జ్యూరీ(జడ్జీల)ఓటు కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది మిస్‌ ఫ్రాన్‌ పోటీల్లో ఎక్కు వైవిధ్యాన్ని అనుమతించింది. అలాగే ఇకపై పోటీల్లో వయోపరిమితి లేదు, వివాహమైన, పిల్లలు ఉన్నా, టాటుల ఉన్నా కూడా పాల్గొనవచ్చునని నిర్వాహకులు పేర్కొన్నారు. 

(చదవండి: డయానా ధరించిన డ్రెస్‌ ధర ఏకంగా రూ. 9 కోట్లు! మరోసారి రికార్డు స్థాయిలో..)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top