వంట అయిపోగానే దానంతట అదే ఆఫ్‌ అయిపోతుంది | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ మినీ స్టవ్‌.. ఎక్కడైనా నిమిషాల్లో వంట వండేయొచ్చు

Published Thu, Dec 28 2023 4:13 PM

Electric Portable Stove Which Has Automatic Closing Function - Sakshi

వండివార్చేవాళ్లకు ఈ ఎలక్ట్రిక్‌ పోర్టబుల్‌ స్టవ్‌ దొరికితే పండుగే! ఎందుకంటే దీనిపై ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ పాత్రతోనైనా సులభంగా వండుకోవచ్చు. ఏ వంటకాన్నయినా నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. ఈ మినీ ఎలక్ట్రిక్‌ స్టవ్‌ని పవర్‌తో కనెక్ట్‌ చేసుకుని.. కుడివైపు ముందు భాగంలో ఉన్న రెగ్యులేటర్‌ను సెట్‌ చేసుకుంటే సరిపోతుంది.

దీనిపైన.. రైస్‌ ఐటమ్స్‌ దగ్గర నుంచి కూరలు, సూప్స్, టీ, కాఫీలన్నిటినీ తయారు చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్‌ క్లోజింగ్‌ ఫంక్షన్‌తో రూపొందటంతో ఔట్‌ డోర్‌ క్యాంపింగ్‌ బర్నర్‌గా యూజ్‌ అవుతుంది.

స్టీల్, గ్లాస్, అల్యూమినియం.. ఇలా అన్నిపాత్రలూ దీనికి సెట్‌ అవుతాయి. ఇలాంటి మోడల్స్‌.. అనేక రంగుల్లో అమ్ముడుపోతున్నాయి. పవర్‌ వాట్స్‌ లేదా సెట్టింగ్స్‌లో చిన్న చిన్న మార్పులతో లభించే ఇలాంటి స్టవ్‌లకు మంచి గిరాకే ఉంది. ధర కూడా తక్కువే. కేవలం15 డాలర్లు (రూ.1,251) మాత్రమే.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement