హెయిర్‌–డై వేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా!

Do You Take These Precautions While Applying Hair Dye - Sakshi

ఒక వయసు దాటాక తెల్లబడ్డ వెంట్రుకలకు రంగువేయడం చూస్తుంటాం. ఇక యువతులూ, కొందరు మహిళలు కూడా స్ట్రెయిటెన్, బ్లీచింగ్‌ చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ ప్రక్రియల్లో జుట్టు (హెయిర్‌ స్ట్రాండ్స్‌) దెబ్బ తినకుండా సంరక్షించుకోడానికి చేయాల్సిన పనులివి... 

  • మాటిమాటికీ దువ్వడం, దువ్వుతున్నప్పుడు చిక్కులున్నచోట మృదువుగా కాకుండా బలంగా దువ్వడం, జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వడం వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయి.  ఇలా దెబ్బతిన్నప్పుడు వెంట్రుక సాఫీగా లేకుండా కొన్నిచోట్ల ఉబ్బుగానూ, మరోచోట పలచగానూ కనిపించవచ్చు. ఇలా కనిపించే వెంట్రుకల్ని ‘బబుల్‌డ్‌ హెయిర్‌’ అంటారు. కాబట్టి వెంట్రుకలపై బలం ఉపయోగించకుండా, మృదువుగా దువ్వేలా జాగ్రత్త వహించాలి
  • షాంపూ వాడే సమయంలో దాన్ని నేరుగా వాడకుండా... అరచేతిలో వేసుకుని, కొన్ని నీళ్లు కలిపి, దాని సాంద్రతను కాస్త తగ్గించాలి. దీంతో వెంట్రుకల మీద షాంపూలోని రసాయనాల తాకిడి, ప్రభావం తగ్గుతాయి
  • తలస్నానం తర్వాత డ్రైయర్‌ వాడేటప్పుడు వెంట్రుకలకు వేడి గాలి మరీ నేరుగా తగలకుండా జాగ్రత్త వహించాలి
  • రంగువేయడం, బ్లీచింగ్‌లతో  జుట్టు రసాయనాలకు ఎక్స్‌పోజ్‌ అవుతుంది. దాంతో వెంట్రుక పైపొర అయిన ‘క్యూటికిల్‌’ దెబ్బతినే అవకాశముంది.  క్యూటికిల్‌ దెబ్బతినగానే కాస్త లోపల ఉండే కార్టెక్స్‌ అనే భాగం బయటపడుతుంది. ఇది క్యూటికిల్‌లా నునుపుగా కాకుండా కాస్తంత గరుకుగా ఉంటుంది. ఫలితంగా జుట్టు నిర్జీవంగా, గజిబిజిగా కనిపిస్తుంటుంది. అందుకే రంగువేసే సమయంలో నాణ్యమైన హెయిర్‌–డై వాడుకోవాలి. ఒకసారి తమకు సరిపడుతుందా లేదా అన్నదీ చూసుకోవాలి.  

(చదవండి: తుంటి ఎముక కీలు సర్జరీ..ఆ పద్ధతి ఎంత వరకు బెస్ట్‌! లాభాలేమిటంటే?)
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top