గ్రిల్డ్ కోకోనట్ ఎపుడైనా ట్రై చేశారా? ధర ఎంతో తెలుసా? | Do you know about Roast coconut street food Indonesia | Sakshi
Sakshi News home page

గ్రిల్డ్ కోకోనట్ ఎపుడైనా ట్రై చేశారా? ధర ఎంతో తెలుసా?

Apr 15 2024 10:23 AM | Updated on Apr 15 2024 11:05 AM

Do you know about Roast coconut street food Indonesia - Sakshi

వేసవిలో కొబ్బరి బొండాంకున్న ప్రాధాన్యతే వేరు.సహజసిద్ధంగా ఏర్పడిన కొబ్బరి నీళ్లలో పోషకాలు కూడా మెండుగా  ఉంటాయి. అయితే మీరెపుడైనా స్పైసీ గ్రిల్డ్   లేదా రోస్టెడ్‌ కొబ్బరిని  టేస్ట్‌ చేశారా? ఇండోనేషియాలో ఈ స్ట్రీట్ డ్రింక్ చాలా ఫ్యామస్‌.

అంతేకాదు ఆక్రమణదారులనుంచి దేశాన్ని కాపాడేందుకు, శారీరక బలం కోసం దీన్ని  అక్కడి  రాజులు  దీన్ని ఎక్కువగా తాగేవారట.  ఇండోనేషియాలో  స్పైస్ గ్రిల్డ్ కోకోనట్ చాలా ఖరీదైంది కూడా. ఒక్కో బోండాం ధర 10వేలకు పైమాటేనట. 

పచ్చి కొబ్బరి కాయను సుమారు 1-2 గంటల పాటు కాల్చుతారు. స్పెషల్‌గా  ఏర్పాటు చేసిన గ్రిల్‌మీద  జాగ్రత్తగా కాల్చుతారు.  ఆతరువాత పైన  పీచు వలిచేసి,లోపల ఉన్న  లేత కొబ్బరితో సహా నీళ్లను సేవిస్తారు. దీన్ని  వేడి వేడిగా, లేదా చల్లగా ఎలాగైన తినవచ్చు. ఇలా కాల్చడం వల్ల కొబ్బరి టేస్ట్‌తోపాటు పోషక విలువలుకూడా  మరింత పెరుగుతాయని ఇ‍క్కడి వారి నమ్మకం. కాల్చిన కొబ్బరి నీళ్లు, స్థానిక సుగంధ ద్రవ్యాలతోపాటు కొద్దిగా షుగర్‌ను కలిపి తాగుతారు. ఒక రోజులో కనీసం 30 కొబ్బరికాయలు అమ్ముడవుతాయి.

Advertisement
 
Advertisement
Advertisement