
అదేదో వ్యాపార ప్రకటనలో చెప్పినట్లు.. ‘తియ్యని వేడుక చేసుకుందామా’ అనే పదం ఎంత తియ్యగా అనిపిస్తుందో.. అదేరీతిలో.. సమయం సందర్భం ఏదైనా.. అది మొదలయ్యేది మాత్రం ‘తియ్యని వేడుక’తోనే.. ఇప్పుడీ సోదంతా ఎందుకంటే.. ప్రస్తుతం దీపావళి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో స్వీట్స్‌కు ఉన్న ప్రాముఖ్యత వేరు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ తియ్యటి గిఫ్ట్ ప్యాకింగ్స్ ఎంచుకుంటారు.. ప్రతీ ఇంటా వెలుగులు చిమ్మే ఈ దీపావళి సీజన్‌లో మనం చేసుకునేది కేవలం ఉత్సవం కాదు.. ఓ ఆత్మీయ కలయిక. స్నేహాన్ని బలపరుచుకోవడం, ఆనందాన్ని పంచుకోవడం అనే భావనల సమ్మేళనం.
దీపావళి నేపథ్యంలో నగరంలో స్వీట్లు, చాక్లెట్ల సందడి గురించి తెలిసిందే. అయితే ఈసారి పండుగకు పశ్చిమ గోదావరి జిల్లా కోకో తోటల నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ వరకూ సాగిన పంచదార రుచి కథలతో.. శ్రమ, కళ, ఫ్యాషన్ సమ్మిళిత చాక్లెట్ ఉత్సవాన్ని నగరవాసులకు పరిచయం చేస్తోంది మనం చాక్లెట్. ఈ సారి దీపావళి ఎడిషన్–2025లో భాగంగా మనం ‘ఉత్సవ టేబుల్’ అనే వినూత్న ఆలోచన చుట్టూ తన సృజనాత్మకతను విస్తరించింది. పంచుకోడానికి, రుచి చూడడానికి, ఆ అనుభూతిని పొందడానికి ఎన్నో మధుర క్షణాలను చాక్లెట్ రూపంలో అందించింది.
పాశ్చాత్య శైలితో కాకుండా, భారతీయ భావనతో రూపొందిన ఈ కలెక్షన్‌లో ప్రతి డబ్బాలో గోదావరి కథలతో ఒక కొత్త అనుభవాన్ని పంచుతోంది. మనం చాక్లెట్ ఖార్ఖానా భారతదేశంలోని మొదటి చాక్లెట్ బ్రాండ్. ఈ ఖార్ఖానాలో ఆంధ్రప్రదేశ్‌లోని పశి్చమ గోదావరి జిల్లాలో పండించిన చక్కటి రుచి గల కోకో బీన్స్‌తో తయారు చేసిన చాక్లెట్‌తో తయారు చేయబడిన 300 కంటే ఎక్కువ ఉత్పత్తులు నగరంలోని విభిన్న రుచులను ఆస్వాదించే చాక్లెట్ ప్రియులను అలరిస్తున్నాయి.
డిజిటల్ ఆర్టిస్ట్ నమ్రతా కుమార్ సృష్టించిన ప్రత్యేక డిజైన్లు ఈ ప్యాకేజింగ్‌కి కొత్త ఉత్సవ రూపాన్ని ఇస్తున్నాయి. ఆమె చిత్రాలలో కేవలం వేడుక కాదు, సమాజం, భాగస్వామ్యం, ఆనందం అనే విలువలు ప్రతిబింబిస్తున్నాయి. దీపావళి అనేది కేవలం వెలుగుల పండుగ కాదు, మనసులు దగ్గరయ్యే సందర్భం. ఆ భావనను మానం చాక్లెట్ తన ప్రత్యేక రుచులతో మరింత బలపరుస్తోంది. ఇండో–అమెరికన్ రుచులతో తయారు చేస్తున్న ఈ చాక్లెట్స్ ప్రత్యేకమైన వేగన్ స్టైల్‌లో తయారు చేశారు.
ఈ చాక్లెట్స్ ఆరోగ్యకరమైన సమ్మేళనాలతో ఏ వయసు వారైనా ఇష్టంగా తీనగలిగే విధంగా రూపోందించారు. ఈ ఎడిషన్‌లో డార్క్‌చాక్లెట్–ఆరెంజ్ క్లస్టర్స్, గుంటూరు మిర్చి–డ్రింకింగ్ చాక్లెట్ మిక్స్, సీ సాల్ట్ స్ప్రింకిల్ థిన్స్, గోదావరి కోకో నిబ్స్ థిన్స్, నట్టీ ప్రాలిన్ బార్క్స్, పిస్తా ఫడ్జ్ ఇన్‌క్లూజన్ టాబ్లెట్, ఇండియన్ ఆరిజిన్ టాబ్లెట్ నెం.6 వంటి ప్రత్యేక ఉత్పత్తులు ఉన్నాయి. వేగన్ స్టైల్‌లో..
(చదవండి: Man Name Makes Record: 'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..)