రూ.14 వేలకే 'దివ్య దక్షిణ్‌ యాత్ర'..తొమ్మిది రోజుల్లో ఏకంగా ఏడు..! | Divya Dakshina Yatra With Jyotirlinga From Secunderabad Package | Sakshi
Sakshi News home page

రూ.14 వేలకే 'దివ్య దక్షిణ యాత్ర'..తొమ్మిది రోజుల్లో ఏకంగా ఏడు..!

Published Fri, Jun 7 2024 6:21 PM | Last Updated on Fri, Jun 7 2024 6:30 PM

Divya Dakshina Yatra With Jyotirlinga From Secunderabad Package

దక్షిణాది పుణ్య క్షేత్రాలు దర్శించుకోవాలనుకునేవారికి ఇది మంచి ఆఫర్‌. తక్కువ ధరలోనే దక్షిణది పుణ్యక్షేత్రాలను దర్మించుకునేలా ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మంచి టూర్‌ ప్యాకేజ్‌ ప్రకటించింది. అందుకోసం సికింద్రబాద్‌ నుంచి మరో భారత గౌరవ్‌ టూరిస్ట్‌ రైలుని తీసుకొచ్చింది. పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసే భారత్‌ గౌరవ్‌ రైళ్లకు యాత్రికుల నుంచి అనూహ్య స్పందన రావడంతో సికింద్రాబాద్‌ నుంచి జ్యోతిర్లింగ సహిత దివ్యదక్షిణ యాత్ర కోసం ప్రత్యేక రైలును ఏర్పాటుచేసింది. 

ఈ పర్యటన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రైలు ప్రయాణీకులకు జ్యోతిర్లింగం (రామేశ్వరం) దర్శనం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. అలాగే ఇతర ముఖ్యమైన యాత్రా స్థలాలను కూడా కవర్‌ చేస్తుంది. ఈనెల 22 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ గౌరవ్‌ రైలుని విజయవాడ, గూడూరు, ఖమ్మం, కాజీపేట, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, సికింద్రాబాద్‌, తెనాలి, వరంగల్‌ స్టేషన్లలో ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం ఆయా రైల్వేస్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్‌ మొత్తం ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లుగా కొనసాగుతుంది. టూటైర్‌ ఏసీ, త్రీటైర్‌ ఏసీ, స్లీపర్‌ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. టికెట్‌ ధరలు రూ.14వేల నుంచి మొదలవుతాయి.

జర్నీ ఎలా సాగుతుందంటే..

 • సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 12.00 గంటలకు రైలు బయలు దేరుతుంది.  

 • రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై(అరుణాచలం) చేరుకుంటారు. అరుణాచలం రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, ఫ్రెష్ అవ్వడానికి హోటల్‌కు చేరుకుంటారు.ఆ తర్వాత అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక సాయంత్రం కుదల్‌నగర్‌కు పయనమవుతారు.

 • మూడో రోజు ఉదయం 6.30 గంటలకు కూడాల్ నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రామేశ్వరానికి చేరుకుంటారు. హోటల్‌లో బస చేసి, ఫ్రెష్ అప్ అయిన తర్వాత రామేశ్వరంలోని దేవాలయాలను సందర్శిస్తారు రాత్రికి రామేశ్వరంలోనే బస ఉంటుంది.

 • నాలుగో రోజు మధ్యాహ్న భోజనం తర్వాత రామేశ్వరం నుంచి మధురైకి బస్సులో బయలుదేరతారు. మీనాక్షి అమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం స్థానికంగా షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది. కన్యాకుమారి వెళ్లేందుకు రాత్రి కూడాల్ నగర్ రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు.  రాత్రి 11.30 కన్యాకుమారికి పయనమవుతారు. 

 • ఐదో రోజు ఉదయం 8 గంటలకు కొచ్చువేలి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కన్యాకుమారికి వెళ్తారు. హోటల్‌లో బస చేస్తారు. ఆ తర్వాత వివేకా రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ టూర్ ఉంటుంది. రాత్రికి కన్యాకుమారిలోనే స్టే చేస్తారు.

 • ఆరో రోజు కన్యాకుమారి - కొచ్చువేలి - తిరుచ్చి-హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి..రోడ్డు మార్గంలో త్రివేండ్రం బయలుదేరి వెళ్తారు. త్రివేండ్రంలో అనంత పద్మనాభస్వామి దేవాలయం,  కోవలం బీచ్‌ని సందర్శిస్తారు. ఇక తిరుచిరాపల్లికి వెళ్లడానికి కొచ్చువేలి స్టేషన్‌లో రైలు ఎక్కుతారు.

 • ఏడో రోజు ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. హోటల్ చేరుకుని ఫ్రెష్ అయ్యి తర్వాత శ్రీరంగం ఆలయ దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత రోడ్డు మార్గంలో తంజావూరు (60 కి.మీ.) వెళ్తారు. తంజావూరు బృహదీశ్వర దేవాలయాన్ని సందర్శించుకుంటారు. అనంతరం రాత్రి 11 గంటలకుతంజావూర్‌లో సికింద్రాబాద్‌ రైలు ఎక్కుతారు.

 • ఎనిమిదో రోజు మొత్తం రైలు జర్నీయే ఉంటుంది. పైన పేర్కొన్న స్టేషన్లలో స్టాపింగ్‌ ఉంటుంది. తొమ్మిదో రోజు ఉదయం 2:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ఛార్జీలు: 

 • ఎకానమీలో ఒక్కరికి రూ. 14,250, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ. 13,250 చెల్లించాలి.

 • స్టాండర్ట్‌లో ఒక్కరికిరూ.21,900; 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు  రూ.20,700 చెల్లించాలి.

 • కంఫర్ట్‌లో ఒక్కరికిరూ.28,450; 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.27,010 చెల్లించాలి.

ఫుడ్‌ ఐఆర్‌టీసీదే..

 • రైలులో టీ, టిఫిన్‌, భోజనంన్ని ఐరా్‌టీసీనే ఏ ర్పాటు చేస్తుంది

 • యాత్రికులకు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.

 • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు మాత్రం వ్యక్తులే చెల్లించువాల్సి ఉంటుంది.

 • పుణ్యక్షేత్రాల్లో స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.

దక్షిణ భారత్లోని జ్యోతిర్లింగ దివ్య క్షేత్రాల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు, బుకింగ్ కోసం ఐఆర్‌టీసీ టూరిజం లింక్‌పై క్లిక్‌ చేయండి.

(చదవండి: తిరుచ్చిలో చూడాల్సిన అద్భుత పర్యాటకప్రదేశాలివే..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement