ది గ్రేట్‌ వడా పావ్‌ వార్‌ | Delhi Vada Pav Girl faces growing competition as multiple rivals emerge | Sakshi
Sakshi News home page

ది గ్రేట్‌ వడా పావ్‌ వార్‌

Apr 7 2024 6:03 AM | Updated on Apr 7 2024 6:03 AM

Delhi Vada Pav Girl faces growing competition as multiple rivals emerge - Sakshi

వైరల్‌

దిల్లీ ‘వైరల్‌ వడా పావ్‌ గర్ల్‌’గా పాపులర్‌ అయిన చంద్రికా గెరా దీక్షిత్‌ తాజాగా తన ఫుడ్‌ కార్ట్‌ సార్టప్‌తో రాత్రికి రాత్రి సెన్సేషన్‌గా మారింది. దీక్షిత్‌ పాపులారిటీ మాట ఎలా ఉన్నా ఆమెకు పోటీదారులు పెరిగారు. దీక్షిత్‌ ఫుడ్‌ కార్ట్‌ చుట్టుపక్కల పోటీదారులు వడా పావ్‌ బండ్లను ఏర్పాటు చేస్తున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. ‘పాపులారిటీనే కొంప ముంచిందా!’ లాంటి హెడ్‌లైన్స్‌ నెటిజనుల నుంచి లైన్‌ కట్టాయి.

‘నిన్న నేను రానందున తన బండిని ఉంచానని ఆంటీ చెప్పింది. ఈరోజు కూడా ఇక్కడే పెట్టింది. ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీయాలనుకోవడం సమంజసమా!’ అని తన ఆవేదనను వెళ్లగక్కింది దీక్షిత్‌.
ఫుడ్‌ వ్లాగర్‌ పూడీ మానేహా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

ఈ వీడియో వైరల్‌ కావడంతో పోటీదారు ఆంటీ ‘ఒకరి వ్యాపారాన్ని దెబ్బతీసే ఉద్దేశం నాకు లేదు. నా పని నేను చేసుకుపోతున్నాను’ అని ఎర్రటి ఎండల్లో కూల్‌గా బదులిచ్చింది. ‘బండి ఎవరు పెట్టారనేది కాదు... రుచి ముఖ్యం’ అని కూడా సెలవిచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement