బొటానికల్ వండర్‌! మానవ పెదవులు పోలిన మొక్క! | Sakshi
Sakshi News home page

బొటానికల్ వండర్‌! మానవ పెదవులు పోలిన మొక్క! ఎక్కడుందంటే..?

Published Wed, Jan 3 2024 11:33 AM

Costa Ricas Stunning Plant Faces Threat Of Extinction - Sakshi

ఈ ప్రకృతిలో ఎన్నో పర్యావరణ అద్భుతాలు ఉన్నాయి. అందులో ఉండే అత్యంత అరుదైన వృక్ష సం‍పద మానువుడిని విస్తుపోయాలే చేస్తుంది. ఇంతవరకు ఎన్నో వింత మొక్కలు చూసుంటారు. కానీ ఇలా లిప్‌స్టిక్‌ వేసిన పెదవుల్లా ఉండే అరుదైన మొక్కను గురించి విన్నారా? అదెక్కడుందంటే..?

ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయా ? అని ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే..? ఇలా మానవ పెదవులు పోలిన మొక్క ఈక్వెడార్‌, దక్షిణ అమెరికా వంటి దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. సైకోట్రియా ఎలాటా లేదా హుకర్స్ లిప్స్ ప్లాంట్‌గా పిలిచే ఈ హాట్‌ లిప్స్‌ ప్లాంట్‌ ఈ భూమ్మీద ఉండే వృక్షజాతుల్లో అత్యంత అరుదైన మొక్కగా పేర్కొనవచ్చు. దీన్ని బొటానికల్‌ వండర్‌గా పిలుస్తారు. ఈ మొక్క ప్రత్యేకత ఏమిటంటే.. బ్రాక్ట్స్‌గా పిలిచే ఈ మొక్క ఆకులు ఎర్రటి రంగులో మానవ పెదవుల్లా కనిపిస్తాయి. ఇవి హమ్మింగ్‌ బర్డ్స్‌, సీతాకోక చిలుకలు పరాగ సంపర్కంలో ఆకర్షించడానికి  ఈ ఎర్రటి ఆకుల భాగమే సహాయపడుతుంది.

అయితే ఈ మొక్క ఆకులు ఉన్నంత ఆకర్షణీయంగా వాటి పువ్వులు కనిపించవు. పువ్వులు పూసే ముందే ఇలా పెదవుల ఆకారంలో ఈ మొక్క కనిపిస్తుందట. దీని లోపలి నుంచి నక్షత్రాల ఆకారంలో తెల్లని పువ్వులు పుష్పిస్తాయి. ఇవి అంతగా అట్రాక్టివ్‌గా కనిపించవు. సువాసనలు వెదజల్లే ఈ పువ్వులు డిసెంబర్, మార్చి నెలల్లో పుష్పిస్తాయి. మధ్య అమెరికాలోని ప్రజలు తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు ప్రేమను వ్యక్తం చేయడానికి ఈ మొక్కను బహుమతిగా ఇస్తారట.

మరీ ముఖ్యంగా వేలంటైన్స్ డే రోజు ప్రేమికులు ఈ మొక్కను బహుమతిగా ఇస్తారట. దీని బెరడు, ఆకులను స్థానికులు చర్మ సంబంధ వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అయితే ఈ మొక్క ప్రస్తుతం కనుమరుగైపోతున్న జాబితాలో ఉందట. వాతావరణ మార్పులే ఇందుకు కారణమని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. భవిష్యత్తు తరాలకు ఈ హుకర్స్‌ లిప్స్‌ ప్లాంట్‌ తెలిసేందుకైనా..ఇది అంతరించిపోకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

(చదవండి: శీతాకాలంలో స్ట్రాబెర్రీలు తినొచ్చా? బరువు తగ్గుతారా..?)

Advertisement

తప్పక చదవండి

Advertisement