స్టీలు ఇల్లు..ఈజీగా మడతేసి తీసుకుపోవచ్చు! | Sakshi
Sakshi News home page

స్టీలు ఇల్లు..ఈజీగా మడతేసి తీసుకుపోవచ్చు!

Published Sun, Jun 25 2023 12:59 PM

Converted Grain Bins Hide A Home On 386 Acres In Washington - Sakshi

‘స్టీలు సామాన్లు కొంటాం.. పాత ఇనుప సామాన్లు కొంటాం..’ అనేది పాతదే. త్వరలోనే ‘స్టీలు ఇళ్లను కొంటాం..’ అని కూడా వినపడొచ్చు. ఎందుకంటే, భవిష్యత్తులో చాలామంది స్టీలు ఇళ్లల్లోనే నివసించనున్నారు. ఈ మధ్యనే వాషింగ్టన్‌లోని ఓ ప్రైవేటు సంస్థ నాలుగు స్టీల్‌ గ్రెయిన్‌ హౌస్‌లను నిర్మించింది. చూడటానికి పాతకాలపు ధ్యానపు డబ్బాల్లా ఉన్నాయి. కానీ, వీటిలోపల విశాలమైన బెడ్‌రూమ్, కిచెన్, బాత్‌రూమ్‌ ఉన్నాయి.

ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే విధంగా ఇందులోని టెంపరేచర్‌ సిస్టమ్‌ పనిచేస్తుంది. పైగా ఇన్‌బిల్ట్‌ సీసీ కెమెరాలతో పనిచేసే స్మార్ట్‌ హోమ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఇంటిని కంటికిరెప్పలా కాపాడుతుంది. దీన్ని మడతేసి ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లచ్చు కూడా.

అవుట్‌డోర్‌ వాతావరణాన్ని ఎంజాయ్‌ చేసేవారికి ఈ ఇల్లు భలే బాగుంటుంది. అయితే ఈ ఇంటి ధర 1.6 మిలియన్‌ డాలర్లు (అంటే రూ. 13 కోట్లు). ఈ ఇళ్ల ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. త్వరలోనే ఈ స్టీలు ఇళ్లను పూర్తిస్థాయిలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం.

(చదవండి: కొండను కొంటారా? ఔను! అమ్మకానికి సిద్ధంగా ఉంది!)

Advertisement
Advertisement