క్రిస్మస్‌ స్పెషల్‌: ఇటాలియన్‌ పీచ్‌ కుకీస్‌, ఇంట్లోనే చేసుకోవచ్చు | Christmas Special Italian Peach Cookies Recipe In Telugu | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ స్పెషల్‌: ఇటాలియన్‌ పీచ్‌ కుకీస్‌, ఇంట్లోనే చేసుకోవచ్చు

Published Fri, Dec 22 2023 12:00 PM | Last Updated on Fri, Dec 22 2023 12:15 PM

Christmas Special Italian Peach Cookies Recipe In Telugu - Sakshi

ఇటాలియన్‌ పీచ్‌ కుకీస్‌ తయారీకి కావల్సినవి:

మైదా – మూడున్నర కప్పులు; వంటసోడా – టేబుల్‌ స్పూను;
కోషర్‌ సాల్ట్‌ – పావు టీస్పూను; బటర్‌ – అరకప్పు;
పంచదార – రెండు కప్పులు; గుడ్లు – రెండు కప్పులు;
వెనీలా ఎసెన్స్‌ – రెండు టీస్పూన్లు; పాలు – కప్పు;
ఎరుపు, పసుపు ఫుడ్‌ కలర్‌ – నాలుగు చుక్కలు (ఒక్కోటి రెండు చుక్కలు).
పీనట్‌  బటర్‌ క్రీమ్‌: బటర్‌ – పావు కప్పు;
వెనీలా ఎసెన్స్‌ – అర టీస్పూను; కోషర్‌ సాల్ట్‌ – చిటికెడు;
పంచదార  పొడి – కప్పు; పీచ్‌ ప్యూరీ – రెండు టేబుల్‌ స్పూన్లు.



తయారీ విధానమిలా:
ఒక గిన్నెలో వంటసోడా, ఉప్పు వేసి కలపాలి ∙దీనిలో బటర్, కప్పు పంచదార వేసి క్రీమ్‌లా మారేంత వరకు హ్యాండ్‌ మిక్సర్‌తో కలపాలి. తరువాత క్రీమ్‌ను పక్కన పెట్టుకోవాలి ∙మిక్సర్‌ను తక్కువ స్పీడ్‌లో పెట్టి గుడ్ల సొన, వెనీలా ఎసెన్స్‌ వేసి రెండు నిమిషాలు బీట్‌ చేసుకోవాలి ∙తరువాత మైదా, బటర్‌ మిశ్రమం అరకప్పు పాలు పోసి అన్ని చక్కగా కలిసేంత వరకు బీట్‌ చేయాలి.

► ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కూప్‌ పరిమాణంలో తీసుకుని గుండ్రని బాల్స్‌లా చేసి పైన కొద్దిగా వత్తి పీచ్‌ ఫ్రూట్‌ ఆకారంలోకి తీసుకు రావాలి ∙ఇలా అన్ని కుకీస్‌ రెడీ అయిన తరువాత అవెన్‌లో పెట్టి 350 డిగ్రీల ఫారిన్‌ హీట్స్‌ వద్ద పదిహేను నిమిషాలు బేక్‌ చేయాలి ∙పీచ్‌ క్రీమ్‌కోసం తీసుకున్న బటర్, వెనీలా ఎసెన్స్, కోషర్‌ సాల్ట్‌ లనుగిన్నెలో వేసి హ్యాండ్‌ మిక్సర్‌తో కలపాలి.

► ఇవన్నీ చక్కగా కలిపిన తరువాత మిక్సర్‌ స్పీడు తగ్గించి పంచదార పొడి, పీచ్‌ ప్యూరీవేసి మీడియం హై లో నిమిషం పాటు మిక్సర్‌తో కలపాలి ∙మిగిలిన అరకప్పు పాలను రెండు సగాలుగా చేసి రెండు వేర్వేరు గిన్నెల్లో పోయాలి.  ఒకదానిలో ఎరుపు, మరో దానిలో పసుపు ఫుడ్‌ కలర్‌ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

► మరోగిన్నెలో మిగిలిన పంచదారను పెట్టుకోవాలి.కుకీస్‌ బేక్‌ అయిన తరువాత..వేడిగా ఉన్నప్పుడే కుకీస్‌ మధ్యలో చిన్న గాటు పెట్టి.. మధ్యలో పీచ్‌క్రీమ్‌ను వేసి శాండ్‌విచ్‌లా కొద్దిగా వత్తాలి ∙ఇప్పుడు కుకీకి ఒకవైపు ఎరు రంగు కలపిన పాలు, మరోవైపు పసుపు రంగు కలపిన పాలు అద్దాలి. చివరిగా పంచదార అద్దితే ఇటాలియన్‌ పీచ్‌ కుకీస్‌ రెడీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement