ఎంతటి ఫిట్‌నెస్‌ కింగ్‌లైనా..ఆ మెట్లు ఎక్కితే కాళ్లు వణికిపోవాల్సిందే! | Sakshi
Sakshi News home page

ఎంతటి ఫిట్‌నెస్‌ కింగ్‌లైనా..ఆ మెట్లు ఎక్కితే కాళ్లు వణికిపోవాల్సిందే!

Published Fri, Apr 19 2024 4:02 PM

Chinas Taishan Goes Viral People Regret Climbing 6600 Steps - Sakshi

ఎన్నో విచిత్రమైన ప్రదేశాలు గురించి విన్నాం.ఎంతో ఎత్తులో ఉండే హోటల్స్‌ దేవాలయాలు గురించి విన్నాం. కానీ వాటిని ఎక్కడం కష్టమేమి కాదు. కేవలం అంత ఎత్తులో ఉన్నాయన్న భయమేతప్పతే ఇంకేమీ ఉండదు. ఎంచక్కా మెట్ల మార్గం లేదా రోప్‌వే సాయంతో వెళ్లిపోయేవారు. కానీ చైనాలో ఈ ప్రసిద్ధ పర్వతం ఎక్కితే ఎంతటి వారికైన కాళ్లు వణికిపోతాయి. చేతిలో కర్ర లేనిది నడవలేరు ఎందుకంటే..

చైనాలో ప్రసిద్ధ తాయ్‌ పర్వతం చారిత్రక సాంస్కృతికి ప్రాముఖ్యత కలిగిన పర్వతం. చైనాలోని షాన్‌డాంగ్‌ ‍ప్రావిన్స్‌లో ఎత్తైన ప్రదేశం. దీన్ని చైనా వాళ్లు పవిత్ర తూర్పు పర్వతంగా పిలుస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం రెండు ఈ పర్వతం వద్ద చూడొచ్చు. అంత విశేషం గల భారీ పర్వతం. ఈ పర్వతం ఎక్కేందుకు ఏకంగా 6600 మెట్లు ఉంటాయి. అయితే ఈ మెట్లు ఎక్కినప్పుడు కింద భాగం సమ ఉష్ణోగ్రత ఉంటుంది. పైకి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత తక్కువగా ఉండి చలిగా ఉంటుంది.

అయితే ఎవ్వరైనా ఈ మెట్లు ఎక్కితే కర్ర పట్టుకోక తప్పదు. అన్ని మెట్టు ఎక్కుతుండటం వల్లనే ఏమో ఎంతటి ఫిట్‌నెస్‌ గల వాళ్లైనా వృద్ధుల వలే గజగజ కాళ్లు వణికిపోతుంటాయి. మీసాలు మెలేసిన కండల ధీరుడైన ఈ మెట్లు ఎక్కితే మాత్రం బాబోయ్‌ అంటూ కర్ర పట్టుకుని వణికిపోక తప్పదు. అంతలా ఉంటుంది ఆ పర్వతం వొంపు, దాని ఉష్ణోగ్రతలు కారణంగానే ఈ పరిస్థితి ఎదురయ్యింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ తెగ వైరల్‌ అయ్యింది. 

(చదవండిఅతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!)

Advertisement

తప్పక చదవండి

Advertisement