తోకతో రికార్డు కొట్టేసింది...

Cat Claims The World Record For Feline With The Longest Tail - Sakshi

ఈ ఫొటోలో విలాసంగా పోజు పెట్టిన పిల్లిని చూశారు కదా! చాలా పిల్లుల్లాగానే ఇది కూడా మామూలు పిల్లి మాత్రమే అనుకుంటే పొరపాటే! ఇది అలాంటిలాంటి పిల్లి కాదు, సుదీర్ఘవాలం కలిగిన మార్జాలరాజం. పొడవుగా పెరిగిన తోకే దీనికి రికార్డు తెచ్చిపెట్టింది. అమెరికాలో మిషిగన్‌కు చెందిన డాక్టర్‌ విలియమ్‌ జాన్‌ పవర్స్‌ పెంచుకుంటున్న ఈ ఐదేళ్ల పిల్లి ప్రపంచంలోనే అత్యంత పొడవైన తోక కలిగిన పిల్లిగా ఇటీవల గిన్నిస్‌ రికార్డు సాధించింది.

దీని పేరు అలై్టర్‌. దీని తోక పొడవు 16.07 అంగుళాలు. ప్రపంచంలో మరే పిల్లికీ ఇంత పొడవాటి తోక లేదని గిన్నిస్‌బుక్‌ అధికారులు ధ్రువీకరించారు. అలై్టర్‌ మాత్రమే కాదు, దీని తోబుట్టువులైన ఆర్కటరస్, ఫెన్రిర్‌లు ఇదివరకు అతి పొడవాటి పిల్లులుగా గిన్నిస్‌ రికార్డులు సాధించాయి. 

(చదవండి: ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top