Cannes 2024: కన్నడ జానపదానికి కాన్స్ బహుమతి | Sakshi
Sakshi News home page

Cannes 2024: కన్నడ జానపదానికి కాన్స్ బహుమతి

Published Sat, May 25 2024 6:18 AM

Cannes 2024: Mysuru filmmaker bags Cannes La Cinef first prize

న్యూస్‌మేకర్‌ 

దక్షిణ భారత జానపద కథ కాన్స్‌ మొదటి బహుమతి గెలుచుకుంది. కోడి కూయకూడదని ఒక అవ్వ పుంజును దొంగిలిస్తే ఆ ఊళ్లో తెల్లారదు. తర్వాత ఏమవుతుందనేది 15 నిమిషాల షార్ట్‌ఫిల్మ్‌గా తీశాడు పూణె ఇన్‌స్టిట్యూట్‌ చిదానంద నాయక్‌. ప్రపంచవ్యాప్తంగా 2263 ఎంట్రీలు వస్తే చిదానంద తీసిన ‘సన్‌ఫ్లవర్స్‌’కు మొదటి బహుమతి వచ్చింది. ఈ ఘనత సాధించిన  చిదానంద పరిచయం.

మారుమూల చిన్న పల్లెటూరు. ప్రతి ఉదయం కోడి కూయగానే తెల్లారుతుంది. ఆ రోజు కోడి కూయలేదు. తెల్లారలేదు. చీకటి. ఎక్కడ చూసినా చీకటి. సూర్యుడు ఎందుకు రావడం లేదు? కోడి కూయడం లేదు. కోడెందుకు కూయడం లేదు? ఊళ్లోని అవ్వ దానిని దొంగిలించి దాచేసింది. దేవుడా... పదండి కోడిని వెతకండి. ఊరంతా బయలుదేరింది. లాంతర్లు పట్టుకుని తలోదిక్కు. అంతేనా? దీనికంతటికీ కారణమైన అవ్వ కుటుంబాన్ని వెలేసింది. కోడి దొరక్క΄ోయినా అవ్వ కనపడక΄ోయినా ఆ ఊరిలో సూర్యుడు వచ్చేలా లేడు. తర్వాత ఏమైంది?

చిదానంద నాయక్‌ తీసిన ‘సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్‌వన్స్‌ టు నో’ (΄÷ద్దు తిరుగుడు పూలకే మొదట తెలుస్తుంది) షార్ట్‌ఫిల్మ్‌ చూడాలి. 15 నిమిషాల ఈ షార్ట్‌ఫిల్మ్‌కు కాన్స్‌ ఫెస్టివల్‌లో ‘లే సినే’ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక బహుమతి దక్కింది.

ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థుల కోసం...
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో చదివే విద్యార్థులను ్ర΄ోత్సహించేందుకు కాన్స్‌ ఫెస్టివల్‌లో ‘లే సినే’ విభాగం ఉంటుంది. దీనికి ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులు గంట నిడివి లోపు ఉన్న షార్ట్‌ఫిల్మ్స్‌ను ఎంట్రీగా పంపవచ్చు. జ్యూరీ వీటిని పరిశీలించి ఫస్ట్, సెకండ్, థర్డ్‌ బహుమతులు ఇస్తుంది. ఈసారి మొత్తం 555 ఫిల్మ్‌ స్కూల్స్‌ నుంచి 2263 ఎంట్రీలు వస్తే మొదటి ప్రైజ్‌ చిదానంద తీసిన ‘సన్‌ఫ్లవర్స్‌’కు దక్కింది. దాదాపు పదమూడున్నర లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. ఇది సామాన్యవిషయం కాదు. మన దక్షిణాది జానపదానికి దక్కిన గౌరవం కింద లెక్క.

దర్శకుడైన డాక్టర్‌
చిదానంద నాయక్‌ది కర్ణాటక. చిన్నప్పటి నుంచి అకిరా కురసావా సినిమాలు చూస్తూ పెరిగాడు. సినిమా దర్శకుడు కావాలని ఉన్నా మెడిసిన్‌ చదవాల్సి వచ్చింది. ‘ఒక డాక్టర్‌గా అతి దగ్గరి నుంచి జననాన్ని, మరణాన్ని చూడటం నాకు మానవ జీవనసారాన్ని తెలిపింది. ఒక వైద్యుడిగా జీవించడమంటే క్షణంలో ఆనందం క్షణంలో దుఃఖాన్ని చూడటమే. మనుషుల మకిలి లేని నిజాయితీని ఆ సమయంలోనే చూస్తాం’ అంటాడు చిదానంద. డాక్టరయ్యాక కూడా మనసు సినిమా రంగంలోనే ఉన్నట్టు అర్థమయ్యి పూణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాడు.

నాలుగు రోజుల్లో షూట్‌:
‘సన్‌ఫ్లవర్స్‌’ షార్ట్‌ఫిల్మ్‌ను తన సంవత్సరాంత అభ్యాసంగా తీశాడు చిదానంద. ‘మా ఇన్‌స్టిట్యూట్‌కు 50 కిలోమీటర్ల దూరం లోపల షార్ట్‌ఫిల్మ్‌ తీయాలని నియమం. ఆ దూరంలోనే ఒక లోపలి పల్లెలో షూట్‌ చేశాం. నాలుగు రోజుల్లోనే తీయమని చె΄్పారు. కథంతా రాత్రే కాబట్టి నాలుగు రాత్రులు ఒళ్లు హూనం చేసుకుని పని చేశాం’ అని తెలి΄ాడు. పూణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులే– సూరజ్‌ (సినిమాటోగ్రఫీ), మనోజ్‌ (ఎడిటింగ్‌) సాంకేతిక శాఖలు నిర్వర్తించారు.

నీ కోడి కూయక΄ోతే...
‘నీ కోడి కూయక΄ోతే తెల్లారదా?’ అనేది లోకోక్తి. అంటే ఎదుటి వారంటే లెక్కలేక΄ోవడం, ఏదైనా లెక్క చేయకుండా ఉండటం ఈ మాటలో ఉంది. కాని ఈ జానపద కథ ప్రతి వ్యక్తి, ప్రతి అనుభవం, ప్రతి మేల్కొలుపు కూడా ముఖ్యమే అని చెబుతుంది. దేనినీ మర్చి΄ోకూడదని, నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తుంది. ‘మా కర్నాటకలో ప్రతి చిన్నపిల్లవాడికి ఈ కథ తెలుసు. దానిని షార్ట్‌ఫిల్మ్‌గా తీయడం, ఈ ప్రతిష్టాత్మక బహుమతి రావడం సంతోషంగా ఉంది’ అంటున్నాడు చిదానంద.

 

Advertisement
 
Advertisement
 
Advertisement