
వర్షాల సీజన్‌లో వేడెక్కే క్రేజ్ బన్‌మస్కా. వేడి వేడి ఇరానీ చాయ్‌తో పాటు ఈ సీజనల్ ఫుడ్‌కి కూడా మూడొస్తుంది. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సిటీలో ఫుడ్ లవర్స్, ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ ప్రేమికుల నుంచి బన్ మస్కా లేదా మలై బన్ లకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది.
తాజా క్రీమ్‌తో మేళవించి పొరలుగా ఉండే ఈ మృదువైన బ్రెడ్‌ను ఇరానీ కేఫ్‌లు, సంప్రదాయ బేకరీలు అందిస్తాయి. నగరంలో చినుకులు పడే ఉదయం, సాయంత్రం వేళల్లో చాలా మంది తినే చిరుతిండి ఇది. గత కొన్నేళ్లుగా ఫుడ్ బ్లాగర్ల కారణంగా ఆధునికుల్లోనూ మరింత ప్రజాదరణ పొందింది. నగరం అంతటా అనేక కేఫ్‌లు నగరానికే ప్రత్యేకించిన ఈ సంప్రదాయ ట్రీట్‌ను అందిస్తూన్నాయి.
వీటిలో దేనికదే ప్రత్యేకమైన రుచికి పేరొందాయి. ఈ వర్షాకాలంలో మంచి మలై బన్‌ను పొందగల కొన్ని చిరునామాలివి..
పిస్తా హౌస్ వారి మలై బన్‌లో కుంకుమపువ్వు (జాఫ్రాన్) పరిమళాన్ని కూడా కలిపి అందిస్తోంది. ఇది వీరి జఫ్రానీ చాయ్ కాంబినేషన్‌తో ఆస్వాదించడం సిటిజనుల అలవాటు.
లక్డికాపుల్‌లోని కేఫ్ నీలోఫర్‌లో బన్ మస్కా ఉదయం 4 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది.
బేగం బజార్‌లో ఉన్న ఈ చట్టు రామ్ యాదవ్ మిల్క్ షాప్ 1944లో స్థాపించారు. ఇప్పుడు ఆ వంశీకుల్లో ఆరో తరం దీనిని నిర్వహిస్తోంది. హైదరాబాదీలకు మలై బన్‌ను పరిచయం చేసింది వీరే.
ఇటీవలి సంవత్సర కాలంలో హసన్ డైరీ అనే కొత్త సంస్థ సిటీ ట్రెడిషనల్ బన్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఇది మలై గులాబ్ జామూన్ బన్, హనీ బన్, నుటెల్లా బన్, కోవా బన్ వంటి వెరైటీలను అందిస్తోంది.
అబిడ్స్, మాధాపూర్‌లో శాఖలు నిర్వహిస్తున్న ‘నయన్‌తారా’ మలై బన్ ప్రియుల్లో బాగా ఫేమస్. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు దీనిని బాగా షేర్ చేస్తున్నారు.
(చదవండి: పెద్దమ్మ గుడిలో ఈ–హుండీ..)