కొత్త పెళ్లికూతురు శోభిత డ్యాన్స్‌.. ఒక రేంజ్‌లో ఉందిగా! | Bride Sobhita Dhulipala Unseen Dancing Mode Video going viral | Sakshi
Sakshi News home page

కొత్త పెళ్లికూతురు శోభిత డ్యాన్స్‌.. ఒక రేంజ్‌లో ఉందిగా!

Dec 10 2024 5:14 PM | Updated on Dec 10 2024 6:03 PM

Bride Sobhita Dhulipala Unseen Dancing Mode Video  going viral

అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ పెళ్లి ముచ్చట్లు ఇంకా నెట్టింట సందడి చేస్తూనే  ఉన్నాయి. టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత రూత్‌ప్రభుతో విడిపోయిన తరువాత నాగచైతన్య నటి శోభితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి ఎంగేజ్‌మెంట్‌, పసుపు కొట్టుడు, హల్దీ, మూడు ముళ్ల వేడుక ఇలా ప్రతీ వేడుక అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా సోషల్‌మీడియాలో పెళ్లి కూతురు  ముస్తాబులో  ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి సంచలనంగా మారింది.

శోభిత పెళ్లికి మేకప్ చేసిన సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా మిశ్రా తన ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో ఈ వీడియోను షేర్ చేసింది.దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఒక వైపు ముస్తాబవుతానే.. మరోవైపు బ్లాక్‌ బస్టర్‌..బ్లాక్‌ బస్టరే అంటూ మాస్‌ మాస్‌గా స్టెప్పులేయడం ఈ వీడియోలు చూడొచ్చు. " శ్రద్ధా...మేరీ షాదీ హో రహీ హై  (నా పెళ్లి అయిపోతోంది) అంటూ సిగ్గుల మొగ్గే అయింది శోభిత.

 

కాగా  గత వారం హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోలో లవ్‌బర్డ్స్‌ నాగచైతన్య,  శోభిత  మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement