
ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(ఐబీఎస్‌ఎఫ్) వరల్డ్ గేమ్స్‌లో టీ 20 క్రికెట్ భాగం అయిన తరవాత కొత్తగా ఏర్పాటైన భారత మహిళా క్రికెట్ జట్టు తమ అద్భుత ప్రతిభతో క్రీడాలోకాన్ని ఆకట్టుకుంది. లీగ్ దశలో ప్రతి మ్యాచ్ గెలిచింది. ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించడాన్ని దృష్టిలో పెట్టుకొని... ‘మా విజయానికి నాకు మాటలు రావడం లేదు. క్రికెట్‌లో నేను మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉంది. చిన్నప్పుడు ఎంతోమంది క్రికెటర్‌ల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు మా గురించి మాట్లాడు కుంటుంటే ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది’ అంటుంది కర్నాటకకు చెందిన దీపిక టీసి.
ఆటలో అత్యత్తమ ప్రతిభ కనబరుస్తున్న బ్లైండ్ ఇండియన్ ఉమెన్ టీమ్‌పై ‘దేఖ్‌లే ఇండియా’ పేరుతో శాంతి మోహన్, ముకుంద మూర్తి డాక్యుమెంటరీ నిర్మించారు. ‘భిన్నమైన సాంస్కృతిక నేపథ్యాల నుంచి రావడం వల్ల తొలిరోజుల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం కష్టంగా ఉండేది. మొదట నే΄ాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సమన్వయం చేయడం కష్టమైంది. దీంతో ఓడి΄ోయాం. క్రమక్రమంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలైంది. సమన్వయం చేసుకోవడంతో సులభం అయింది’ అంటుంది కర్నాటక ప్లేయర్, టీమ్ కెప్టెన్ వర్ష. ‘మాకు కావాల్సింది మీ సానుభూతి కాదు. మద్దతు’ అంటున్నారు టీమ్ సభ్యులు.
‘మన దేశంలో క్రికెట్ అనేది చాలా పాపులర్ అయినప్పటికీ చాలామందికి బ్లైండ్ క్రికెట్ ఉమెన్ టీమ్ ఉంది అనే విషయం తెలియదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డాక్యుమెంటరీ తీయాలనుకున్నాం. ఈ జట్టులో ఉన్న అమ్మాయిలు అంధులు మాత్రమే కాదు కఠినమైన సామాజిక, ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చినవారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి రావడం అనేది సాధారణ విషయం కాదు’ అంటున్నాడు ‘దేఖ్‌లే ఇండియా’ డాక్యుమెంటరీ నిర్మించిన వారిలో ఒకరైన శాంతి మోహన్