ఇవి తింటే.. ఆస్తమా అటాక్‌ అవ్వదు! | Sakshi
Sakshi News home page

ఇవి తింటే.. ఆస్తమా అటాక్‌ అవ్వదు!

Published Sun, Jul 30 2023 9:58 AM

Asthma And Diet: What Food Eat And Avoid - Sakshi

ఆస్తమా నివారణ ఇలా... ఆస్తమా ఊపిరాడనివ్వకుండా చేస్త... ఎంతగా ఇబ్బంది పెడుతుందో తెలిసిన విషయమే. పైగా వర్షాలతో ఇప్పుడున్న వాతావరణం ఆస్తమాకు మరింత దోహదం చేస్తుంది.

కొన్ని ఆహారాలతో ఆస్తమా అటాక్‌ రాకుండా నివారణ ఇలా...

  • తమకు సరిపడని పదార్థాలతో ఆస్తమా ట్రిగర్‌ అవుతుంది. అందుకే ఆహారాల్లో తమకు సరిపడని వాటికి దూరంగా ఉండాలి.
  • భోజనంలో... ఆకుకూరల్లో పాలకూర, బచ్చలి వంటి వాటివి... కాయగూరల్లో కాకర, గుమ్మడి, క్యారట్, బీట్‌రూట్, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యాలు తీసుకోవాలి.
  • పండ్లలో పుల్లటి పండ్లయిన కమలాలు, నిమ్మ, బత్తాయి, అరటిపండు వంటి వాటిని మినహాయించి, మిగతావాటిని అంటే ఉదాహరణకు బెర్రీ, బొప్పాయి వంటి పండ్లను తీసుకోవచ్చు.
  • ఆహారాన్ని వండేందుకు ఉపయోగించే దినుసుల్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్‌ ఆయిల్‌ వంటివి వాడుకోవచ్చు. ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, అల్లం, పసుపు వంటి సహజ మసాలాదినుసులు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి.

(చదవండి: షిజెల్లోసిస్‌..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!)

Advertisement
Advertisement