షిజెల్లోసిస్‌..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి! | Sakshi
Sakshi News home page

షిజెల్లోసిస్‌..! పిల్లల్ని బంకలా పట్టేస్తాయి!

Published Sun, Jul 30 2023 9:33 AM

Bloody Diarrhoea In Children Causes Symptoms Treatment - Sakshi

వర్షాలు కొన్ని ఆరోగ్య సమస్యల్ని వెంటబెట్టుకొస్తాయి. మరికొన్ని వ్యాధుల్ని మరింతగా పెచ్చరిల్లేలా చేస్తాయి. మరీ ముఖ్యంగా పిల్లల్లో! వాళ్లతో పాటు పెద్దల్లో కూడా. ఇది చిన్నదిగా కనిపించే పెద్ద సమస్యే. సామాన్యజనం పరిభాషలో ‘నెత్తుటిబంక విరేచనాలు’ అంటారు. విరేచనాలవుతూ ఉండగా అందులో కొద్దిగా రక్తం, మరికొద్దిగా చీములా పడుతుండటంతో ఈ పేరు. షిజెల్లా అనే ప్రజాతికి చెందిన ఓ బ్యాక్టీరియాతో వచ్చే సమస్య ఇది. కలుషితమైన నీటి వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే వ్యాధి. నీరు కలుషితం అవ్వడానికి అనువుగా ఉండే ఈ సీజన్‌లో మరింత ఎక్కువగా కనిపిస్తుంది. షిజెల్లోసిస్‌ వ్యాధిపై అవగాహన కోసం ఈ కథనం.

మానవ విసర్జకాలతో కలుషితమైన నీరు తాగడం వల్ల, ఆ నీటితో చేసిన వంటల వల్ల షిజెల్లా బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిం, మానవ జీర్ణవ్యవస్థలోకి చేరి, విరేచనాలు మొదలవుతాయి. ఈ విరేచనాలు కాస్త జిగటగా, నెత్తురుతో ఉండటంతో మామూలు వాటికంటే ఎక్కువగా ఆందోళన కలిగిస్తాయి. పిల్లల్లో అందునా ఐదేళ్లలోపు వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూస్తుంటారు.

లక్షణాలు:

  • విరేచనాల్లో బంక (మ్యూకస్‌), నెత్తురు కనిపించడం.
  • కడుపు పట్టేసినట్లుగా అనిపించడం (స్టమక్‌ క్రాంప్స్‌), కడుపు నొప్పి
  • జ్వరం (జ్వరతీవ్రత 101 ఫారెన్‌హీట్‌ వరకు ఉండవచ్చు)
  • వికారం, కొన్నిసార్లు వాంతులు.

వ్యాప్తి ఇలా... ∙కలుషితాహారంతో :
షిజెల్లా బ్యాక్టీరియాతో కలుషితమైన నీటితో తయారు చేసిన ఆహారంతో లేదా ఆ నీళ్లు తాగడం వల్ల; లేదా ఆ నీటిలో ఈదినప్పుడు నోట్లోకి వెళ్లినప్పుడు మింగడం వల్ల.
వ్యక్తి నుంచి వ్యక్తికి: ఈ బ్యాక్టీరియా కలిగి ఉన్న వ్యక్తి తన పెదవుల్ని చేతులతో తాకాక అవే చేతుల్ని ఇతరులు ముట్టుకున్నప్పుడు.
ఇది పిల్లల డే కేర్‌ సెంటర్లలో, పిల్లలను ఆడిపించే క్రష్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌ ద్వారా... అలాగే హైజీన్‌ తక్కువగా ఉండే విద్యార్థుల హాస్టల్స్, మెస్‌లు, క్యాంపస్‌లలో వ్యాపించే అవకావం ఎక్కువ. ఇక ప్రయాణాల్లో అంతగా పరిశుభ్రత పాటించని హోటళ్ల వల్ల కూడా ఒకరినుంచి మరొకరికి పాకవచ్చు.

కొన్నిసార్లు కాంప్లికేషన్లు...
డీ–హైడ్రేషన్‌తో : విరేచనాల కారణంగా దేహంలోని ద్రవాలను కోల్పోవడంతో డీ–హైడ్రేషన్‌కు గురికావచ్చు. ఫలితంగా తల తిరగడం (డిజ్జీనెస్‌); తేలిగ్గా అనిపించడం (లైట్‌ హెడెడ్‌నెస్‌); పిల్లల్లో కన్నీళ్లు కూడా కనిపించకపోవడం, కళ్లు లోతుకుపోయినట్లుగా కనిపించడం... మరీ చిన్నపిల్లల్లో ఈ పరిస్థితులు తీవ్రమైతే ఒక్కోసారి షాక్‌కూ... అటు తర్వాత ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు.

మూర్ఛ (సీజర్స్‌) : కొంతమంది పిల్లల్లో మూర్ఛ (సీజర్స్‌) కనిపించవచ్చు. జ్వర తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా జరిగే అవకావాలు ఎక్కువ. ∙మలద్వారం చివరి భాగం బయటికి జారడం (రెక్టల్‌ ప్రొలాప్స్‌) : జిగురుతో కూడిన మ్యూకస్‌ బంకలా పడటం వల్ల మలద్వారం చివరి భాగం బయటకు జారే అవకాశం ఉంటుంది. దీన్నే రెక్టల్‌ ప్రొలాప్స్‌ అంటారు.

హీమోలైటిక్‌ అనీమియా : ఇది చాలా అరుదుగా మాత్రమే కనిపించే ముప్పు అయినప్పటికీ కొట్టి పారేయలేని సమస్య. నెత్తుటి విరేచనాలు అవుతుండటంవల్ల ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గడం (హీమోలైటిక్‌ అనీమియా), ప్లేట్‌లెట్స్‌ తగ్గడం (థ్రాంబోసైటోపీనియా)... చాలా అరుదుగా ఒక్కోసారి మూత్రపిండాల వైఫల్యం కనిపించవచ్చు.

టాక్సిక్‌ మెగాకోలన్‌: ఇది కూడా చాలా అరుదుగా మాత్రమే కనిపించే ముప్పు. ఇందులో పేగుల కదలిక (బవెల్‌ మూవ్‌మెంట్‌) మందగించి మలం ముందుకు కదలడం ఆగిపోవచ్చు. దాంతో గ్యాస్‌గానీ, మలవిసర్జన గానీ జరగకపోవచ్చు. ఇలాంటి వైఫల్యం కనిపింనప్పుడు దీన్ని మెడికల్‌ ఎమర్జెన్సీగా పరిగణిం వెంటనే చికిత్స తీసుకోకపోతే పెద్దపేగు గాయపడటంతో పాటు ఒక్కోసారి ప్రాణాపాయానికీ దారితీసే ప్రవదం ఉంటుంది.

బ్యాక్టీరిమియా : షిజెల్లా ఇన్ఫెక్షన్‌తో పేగుల లోపలి లైనింగ్‌ దెబ్బతినవచ్చు. దాంతో ఇలా దెబ్బతిన్న ప్రాంతం నుంచి ఇన్ఫెక్షన్‌ రక్తంలోకి వ్యాపిస్తుంది. ఇది కాస్త అరుదు. నివారణ

కేర్‌ఫుల్‌ డిస్పోజల్‌ ఆఫ్‌ డయపర్స్‌ :‍

  • చిన్న పిల్లల డయపర్స్‌ను జాగ్రత్తగా పారేయాలి. వీటిని నీటివనరు (వాటర్‌ సోర్స్‌)తో కలవనివ్వకుండా జాగ్రత్తపడాలి.
  • అప్పటికే విరేచనాల, నీళ్ల విరేచనాల, నెత్తుటిబంక విరేచనాలతో బాధపడుతున్నవారు... వంట చేయడం సరికాదు. వాళ్లు కిచెన్‌ నుంచి దూరంగా ఉండాలి.
  • భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత తప్పనిసరిగా కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో రుద్దుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.

గుడ్‌ టాయెలెట్‌ హ్యాబిట్స్‌:

  • పిల్లలకూ చేతులు కడుక్కునే అలవాటు నేర్పాలి.
  • స్ల్స్కూ, పిల్లల కేర్‌ సెంటర్స్, ఆటస్థలాలు, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు, వాళ్ల టాయిలెట్స్‌ పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు స్విమ్మింగ్‌ పూల్స్‌లో లేదా పల్లెల్లో చెరువులు, బావుల్లో ఈదుతున్నప్పుడు ఆ నీటిని మింగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • చెరువులు, వాగుల వంటి నీటి వనరు నుంచి తెచ్చిన నీటిని కాచి వడబోయకుండా తాగవద్దు. అలాగే పట్టణాల్లోన కొళాయి/నల్లా నీటిని శుభ్రం చేయడం, వడబోయడం వంటివి చేయకుండా వాడకూడదు.


--డాక్టర్‌ శివనారాయణ రెడ్డి,
సీనియర్‌ పీడియాట్రీషియన్‌
 

(చదవండి: కీళ్లనొప్పులా?.. ఈ ఆహారం తీసుకోండి!)

Advertisement
 
Advertisement