అరవింద్‌ కేజ్రీవాల్‌ మామిడి పండ్ల డైట్‌..షుగర్‌ పేషెంట్లకు మంచిదేనా..? | Sakshi
Sakshi News home page

Mangoes In Diabetes: అరవింద్‌ కేజ్రీవాల్‌ మామిడి పండ్ల డైట్‌..షుగర్‌ పేషెంట్లకు మంచిదేనా..?

Published Fri, Apr 19 2024 5:03 PM

Arvind Kejriwal Manipulating His Diet Can Eat Mangoes In Diabetes People - Sakshi

లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ ఉద్దేశపూర్వకంగానే డైట్‌లో  మామిడిపండ్లు తీసుకోవడం, టీలో చక్కెర వేసుకోవడం వంటివి చేస్తున్నారని ఈడీ​ ఆరోపణలు చేసింది. అయితే కోర్టు ఇంటి నుంచి తీసుకొచ్చిన ఆహారం తినడానికి అనుమతించినందున మామిడిపండ్లు, స్వీట్లతో సహా ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే మధుమేహం ఉన్నవ్యక్తి ఇలాంటివి తింటారా అనేది ఈడీ వాదన, కానీ కేజ్రీవాల్‌ న్యాయవాది మాత్రం డాక్టర్‌ సూచించన ప్రకారమే ఇంటి నుంచి ఆహారం పంపిస్తున్నారని చెప్పారు. అయితే ఇక్కడ మామిడి పండు కారణంగా డయాబెటిస్‌ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయలు పెరుగుతాయా అంటే..?

నిజానికి అరవింద్‌ కేజ్రీవాల్‌ టైప్‌2 డయాబెటిస్‌  పేషెంట్‌.  ఆయనకు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. తన చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి రోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారని ఆయన తరుపు న్యాయవాది తెలిపారు. ఇక్కడ ఆయన డైట్‌లో మామిడిపండ్లు తీసుకుంటున్నారు. అందువల్ల షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోతాయా? అసలు షుగర్‌ పేషెంట్లు తినోచ్చా అంటే..

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో మామిడి పండు ఒకటి. ఇది అధిక చక్కెర కంటెంట్ తోపాటు ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్‌లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్‌ సీ, ఫైబర్‌, కాపర్‌లు వంటివి పుష్కలంగా ఉంటాయి. దీనిలో ముఖ్యంగా మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. అయితే ఇందులో 90 శాతానికి పైగా కేలరీలు చక్కెర నుంచే వస్తాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారిలో చక్కెర స్థాయిలు పెరగడానికి ఇది దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

అంతేగాదు డయాబెటిస్‌ ఉన్న వ్యక్తులు చక్కెర స్థాయిలను ఉన్న ఆహార పదార్థాలను ఎక్కువ తీసుకోకూడదు. ముఖ్యంగా మామిడి, అరటి పండ్లు, సపోటా, వంటివి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయని యశోద హాస్పిటల్స్‌​ సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ ఎల్‌ సుదర్మన్‌ రెడ్డి అన్నారు. అయితే ఇందులో వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వాటి మొత్తం చక్కెర ప్రభావాన్ని తగ్గించడంలో పాత్ర పోషిస్తాయి. అందులో ఉండే ఫైబర్‌ శరీరంలోని రక్తం చక్కెరను గ్రహించే రేటుని తగ్గిస్తుంది. పైగా శరీరంలోని కార్బోహైడ్రేట్లు ప్రభావాన్ని తగ్గించి రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించేలా చేస్తుంది. అందువల్ల ఈ పండుని తీసుకుంటే షుగర్‌ పేషంట్లకు కూడా ఎలాంటి హాని ఉండదని తెలిపారు.  అయితే దీని వల్ల మంచి ప్రయోజనాలు పొందేలా షుగర్‌ పేషెంట్లు ఎలా తీసుకుంటే మంచిదంటే..

మామిడి పండును డయాబెటిక్‌ ఫ్రెండ్లీగా మార్చే మార్గాలు..

  • ముందుగా డైట్‌ని అరకప్పు మామిడి కప్పులతో ప్రారంభించండి
  • ఆ రోజు అధిక కార్బోహైడ్రేట్లు తీసుకోకూడదు. ప్రోటీన్‌లు తీసుకోవాలి. అందుకోసం గుడ్డు, కొన్ని రకాల తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. 
  • మామిడి పండ్లు అమితంగా ఇష్టం అనుకునేవారు ఆరోజు మంచిగా పండ్లు తింటూనే సరిపడ ప్రోటీన్‌ ఫైబర్‌ అందేలా ఫుడ్స్‌ని జోడిస్తే సరి. అప్పుడు మామిడిపండ్లు డయాబెటిస్‌ పేషెంట్లు తిన్నా ఏం కాదు. 

(చదవండి: 61 ఏళ్ల వయసులో 38 ఏళ్ల కుర్రాడిలా..ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..!)

Advertisement
 
Advertisement