
గొప్ప రచయిత, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 16న ఆయన గౌరవార్థం తెలుగు నాటకరంగ దినోత్సవంగా ప్రతీ సంవత్సరం నిర్వహిస్తారు. ఆధునిక తెలుగు నాటకరంగంలో తొలి నాటకకర్త, తొలి దర్శకుడు, తొలి ప్రదర్శనకారుడైన 2007లో తెలుగు నాటకరంగ దినోత్సవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది.
ఈ సందర్భంగా ప్రముఖ యాంకర్, నటి ఝాన్సీ కొన్ని ఫోటోలను షేర్ చేశారు తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా మె నాటకరంగం తనకున్న అభిమానాన్ని ప్రేమను చాటుకున్నారు. . ఈ సందర్భంగా కళాకారులకు శుభాకాంక్షలందించారు.
యాంకర్ ఝాన్సీ ఇన్‌స్టా పోస్ట్: రేడియో నాటకంతో మొదలైన నా ప్రయాణం, టీవీ, సినిమాల నుంచీ రంగస్థలం వైపుకి రావడం చాలా మందికి విడ్డూరంగా తోచవచ్చు.నా తపన నాటక ప్రక్రియని ప్రేమించే వాళ్లకి మాత్రం అర్ధం అయితే చాలు.నేను నాటకానికి క్రొత్త..కానీ సమకాలీన నాటక రంగంలోని సరి క్రొత్త ఒరవడిలో ఒక కెరటాన్ని కావాలని ఆకాంక్ష. తెలుగు నాటకరంగాన్ని పరిపుష్టం చేసిన మహామహులందరినీ తలుచుకుంటూ, తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు.
ఇదీ చదవండి: మాలాంటి క్షోభ మరెవ్వరికీ వద్దు..వారికి సాయం చేయాలి : బాబూ మోహన్
కాగా కందుకూరి వీరేశలింగం పంతులు బహుముఖ ప్రజ్ఞాశాలి. తన రచనల ద్వారా జాతి వివక్ష , అనేక ఇతర సామాజిక దురాచారాలపై అవిశ్రాంత పోరు సలిపారు. ఆయన రచించిన అనేక అభ్యుదయ నాటకాలు, నవలలు, సామాజిక వ్యంగ్య రచనలు తెలుగు సాహిత్యంపై గొప్ప ప్రభావాన్ని చూపాయి. వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త కూడా, వితంతు పునర్వివాహాలకోసం ఆయన చేసిన కృషి స్త్రీజాతికి ఎంతో మేలు చేసింది.
చదవండి: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం!